భారత్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. కీలక అప్ డేట్!
భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 6 May 2025 8:30 AMభారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... కెపాసిట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎస్.సీ.సీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తో తమ జాయింట్ వెంచర్ కు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సీ.ఎల్) నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ (ఎల్.ఓ.ఏ) లభించిందని ప్రకటించింది.
అవును... ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి కెపాసిట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎస్.సీ.సీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తో తమ జాయింట్ వెంచర్ కు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ లభించిందని ప్రకటించింది. జీఎస్టీ మినహా ఈ ప్రాజెక్ట్ విలువ రూ.384.72 కోట్లుగా చెబుతున్నారు.
ఇదే సమయంలో తాజా ఒప్పందంలో ప్రతిష్టాత్మకమైన ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం గుజరాత్ లోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహణ, సాంకేతిక కేంద్రాల రూపకల్పనతో పాటు నిర్మాణం ఉంటుందని సంస్థ ప్రకటించింది. దీంతో... ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లో ఓ కీలక పరిణామం చోటు చేసుకున్నట్లే!
ఈ సందర్భంగా స్పందించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ కత్యాల్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ తమకు బాధ్యత అప్పగించినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తమ శక్తి, సామర్థ్యాలపై వారు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఇది తమ సంస్థ ప్రయాణంలో ఓ మైలు రాయని అన్నారు.