ఫిల్మ్‌మేకర్స్‌ని తాకిన 'బాయ్‌కాట్ తుర్కియే'!
ప్రస్తుతం ఇది ఫిల్మ్ మేకర్స్‌ని తాకింది. పర్యాటకం ద్వారా ఏటా భారీ మొత్తాన్ని తుర్కియే , అజర్ బైజాన్ దేశాలు దక్కించుకుంటున్నాయి.
By: Tupaki Desk | 14 May 2025 9:37 PM ISTఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు సపోర్ట్‌గా నిలిచిన తుర్కియో, అజార్ బైజాన్‌లపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రావెల్ ఏజెన్సీలు ఈ రెండు దేశాలకు ఆన్ లైన్ బికింగ్‌లను నిలిపివేశారు. దీంతో బుకింగ్‌లు ఇరు దేశాలకు 60 శాతం పడిపోయాయి. క్యాన్సలేషన్‌లు 250 శాతానికి పడిపోయినట్టుగా ట్రావెల్ సంస్థ `మేక్ మై ట్రిప్` తాజాగా ప్రకటించింది.
పాకిస్థాన్‌తో జరిగిన వార్‌లో ఆ దేశానికి తుర్కియే డ్రోన్‌లను, సైనికులని సరఫరా చేసింది. అంతే కాకుండా కారచీ పోర్ట్‌కు యుద్ధనౌకని పంపించి మరింత సపోర్ట్ చేసింది. దీనిపై ఆదేశ ప్రధాని ఏర్డోగాన్ `తేర్కియే బాయ్ కాట్`కు మరింత ఆజ్యం పోశారు. దీంతో `బాయ్ కాట్ తుర్కియే` హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే పూణెకు చెందిన వ్యాపారులు అక్కడి యాపిల్ దిగుమతుల్ని నిరాకరించడంతో ఈ ఉద్యమం మరింత ఉదృతంగా మారింది.
ప్రస్తుతం ఇది ఫిల్మ్ మేకర్స్‌ని తాకింది. పర్యాటకం ద్వారా ఏటా భారీ మొత్తాన్ని తుర్కియే , అజర్ బైజాన్ దేశాలు దక్కించుకుంటున్నాయి. మన దేశం నుంచే అత్యధికంగా తుర్కియే, అజర్ బైజాన్‌కు వెకేషన్‌ల కోసం వెళుతుంటారు. ఇకపై అలా వెళ్లేవాళ్లు మన దేశం గురించి ఆలోచించాలని, ఇకపై ఆదేశ పర్యాటకాన్ని బాయ్‌కాట్ చేయాలని పలువురు కామెంట్‌లు చేస్తున్నారు. తాజాగా `బాయ్ కాట్ తుర్కియే`పై ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) డిమాండ్ చేసింది.
ఇకపై ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ తుర్కియేతో షూటింగ్స్ చేయకూడదని, ఆదేశాన్ని బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో దేశమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. `మేక్‌మై ట్రిప్` కూడా తుర్కియే, అజార్ బైజాన్ దేశాల బుకింగ్స్‌ని నిలిపివేసిందని, వారి వెబ్‌సైట్‌లో ఈ రెండు దేశాల ట్రావెల్ బుకింగ్స్ 60 శాతానికి తగ్గాయని వెల్లడించింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాలు కూడా స్పందిస్తాయని అంతా ఎదురు చూస్తున్నారు.
