పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్... మళ్లీ ఏమైంది?
అవును... పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు భారత్ పలు దౌత్య పరమైన నిర్ణయాలు తీసుకుంటూ, సైనిక చర్యకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2025 11:01 AM ISTపహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు భారత్ కు మధ్య ఉన్న గ్యాప్ మరింతగా, చాలా ఎక్కువగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. వీలైనంత వరకూ పాక్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని భావించిన భారత్... వాణిజ్య బంధాన్ని తుంచేసింది, నదీ జలాల ఒప్పందాలను పక్కనపడేసింది. ఇదే సమయంలో... ఆ దేశానికి చెందిన సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్యాన్ చేసింది. తాజాగా మళ్లీ బ్యాన్ చేసింది.
అవును... పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు భారత్ పలు దౌత్య పరమైన నిర్ణయాలు తీసుకుంటూ, సైనిక చర్యకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. పాకిస్థాన్ కు చెందిన సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్ లను బ్యాన్ చేసింది. అయితే... బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో... యూట్యూబ్ లో పాక్ సెలబ్రెటీల ఛానల్స్ మళ్లీ దర్శనమిచ్చాయి.
ఇన్ స్టాలోనూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. మళ్లీ రచ్చ మొదలైంది. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారనే నిలదీతలు మొదలయ్యాయి. వారిపై నిషేధాన్ని కంటిన్యూ చేయాల్సిందే అనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. దీంతో పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్ లో మళ్లీ బ్లాక్ చేశారు.
దీంతో... పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు వీరి ఖాతాలను గురువారం ఉదయం నుంచి నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే... ఈ వ్యవహారంపై ప్ర్భుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా... పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. పాక్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ను భారత్ లో నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పాకిస్థాన్ నేతలు, పాక్ న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ పై వేటు పండింది.
ఇదే సమయంలో... పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, బాసిత్ అలీ సహా క్రీడాకారులు, కళాకారుల ఛానళ్లు, అకౌంట్స్ కూడా బ్యాన్ చేయబడ్డాయి. అదేవిధంగా... ఆ దేశ రక్షణ మంత్రి ప్రధాని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేశారు. ఈ బ్యాన్ ను బుధవారం ఎత్తివేయగా.. గురువారం ఉదయం మళ్లీ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది!
