Begin typing your search above and press return to search.

బయటకు వచ్చిన ప్రైవేట్ శాటిలైట్ పిక్ లు.. పాక్ బేస్ లు బద్ధలు

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతిగా భారత్ వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2025 10:08 AM IST
బయటకు వచ్చిన ప్రైవేట్ శాటిలైట్ పిక్ లు.. పాక్ బేస్ లు బద్ధలు
X

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతిగా భారత్ వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేయటం తెలిసిందే. నిజానికి పాకిస్తాన్ జరిపిన భారీ డ్రోన్ల దాడులను భారత వైమానిక దళం ఆకాశంలోనే నిర్వీర్యం చేసి ఉండకపోతే.. జరిగే నష్టం భారీగా ఉండటమే కాదు.. భారత ఆత్మస్థైర్యాన్ని ఘోరంగా దెబ్బ తీసేదని చెబుతున్నారు. అసలేం జరగకుండానే తాము చాలా చేసినట్లుగా ఫేక్ న్యూస్ కథల్ని క్రియేట్ చేసిన పాక్.. గగనతనంలో పాక్ డ్రోన్లను నిలువరించకపోయి ఉంటే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది.

ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ జరిపిన దాడుల్ని తిప్పి కొట్టటమే కాదు.. అందుకు ప్రతిగా పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు.. క్షిపణి దాడుల్ని చేపట్టింది భారత సైన్యం. ఈ దాడులతో పాక్ కు జరిగిన నష్టం ఎంతన్న విషయం ఒకటి తర్వాత ఒకటి చొప్పున బయటకు వస్తోంది. పాకిస్తాన్ మీద భారత్ జరిపిన వైమానిక దాడులతో భారీ నష్టం వాటిల్లినట్లుగా భారత వాయుసేన చెప్పినప్పటికీ.. వాస్తవం ఎంత? అన్న సందేహం చాలా దేశాల్లో ఉండేది. ఇలాంటి సందేహాలను పటాపంచలు చేసేలా ప్రైవేటు శాటిలైట్లు తీసిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చి.. భారత వైమానిక దళ సత్తా ఏమిటన్నది ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని చెప్పాలి.

భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా పదకొండు మిలటరీ ఎయిర బేస్ లు ధ్వంసమైన విషయాన్ని తాజా ప్రైవేటు శాటిలైట్లు ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడులకు విమాన రన్ వేలు.. విమానాల్ని నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసం అయినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ తన వైమానిక దాడుల తీవ్రతను మరింత పెంచిన పక్షంలో ఎయిర్ బేస్ లు పూర్తిగా నేలమట్టం అయి ఉండేవన్న భావన కలుగక మానదు.

భారత దాడులకు బెదిరి.. పాక్ కాళ్ల బేరానికి వచ్చినట్లుగా చెప్పే వాదనకు బలం చేకూరేలా ఈ శాటిలైట్ చిత్రాలు ఉన్నట్లుగా చెప్పాలి. తాజాగా ఈ ఫోటోలు జాతీయ మీడియా కథనాల్లో దర్శనమిస్తున్నాయి. పాకిస్తాన్ లోని వేర్వేరు చోట్ల ఉన్న ఎయిర్ బేస్ ల మీద భారత్ కచ్ఛితమైన లక్ష్యాలుగా ఎంచుకొని మరి ధ్వంసం చేసినట్లుగా శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకూ ఈ ఎయిర్ బేస్ ప్రాంతాలు ఏమిటన్నది చూస్తే..

- సింధ్ లోని సిక్కూర్

- రావర్పిండిలోని నూర్ ఖాన్

- దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ లోని రహీం యార్ ఖాన్

- సర్గోధాలోని ముషాఫ్

- ఉత్తర సింద్ లోని జకోబాబాద్

- ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్ బేస్

- వస్రూర్

- సియాల్ కోట్

- చక్లా ఎయిర్ బేస్ తో పాటు మరో రెండు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక.. భారత చేపట్టిన దాడులకు ఏయే ఎయిర బేస్ లు ఎంతలా డ్యామేజ్ అయ్యాయన్న వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలను ఖండించేలా పాక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం గమనార్హం. ఇంతకూ ఏయే ఎయిర్ బేస్ లో ఎంతటి విధ్వంసం చోటు చేసుకున్నదన్నది చూస్తే..

- పస్రూర్.. సియాల్ కోట్ లోని ఎయిర్ బేస్ లో రాడార్ కేంద్రాలు భారత్ ప్రయోగించిన క్షిపణుల దాడికి పేలిపోయాయి.

- సుక్కూర్ ఎయిర్ బేస్ లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి

- చక్లాలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో భారీ సైనిక.. సరుకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బ తిన్నాయి.

- రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఒక్కటే రన్ వే ఉంది. మిగిలినవి ధ్వంసమయ్యాయి.

- రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ పై జరిగిన బాంబు దాడితో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్ వే పాక్షిక్షంగా ధ్వంసమైంది.

- ముషాఫ్ ఎయిర్ బేస్ రన్ వే మీద రెండు పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి పది అడుగులు.. రెండోది పదిహేను అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. సమీప రవాణా వాహనాలు దెబ్బ తిన్నాయి.

- జకోబాబాద్ లోని షాబాజ్ ఎయిర్ బేస్.. భోలారీ ఎయిర్ బేస్ లో ఒక్కొక్కటి చొప్పున విమాన హ్యాంగర్ కు భారీ నష్టం వాటిల్లింది. హ్యాంగర్ లో నిలిపి ఉంచి విమానాలు దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా చూస్తే.. పాక్ లో ఇంత భారీ విధ్వంసం జరిగిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఉద్రిక్తల వేళ భారత అధిక్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.