Begin typing your search above and press return to search.

శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భారత వైమానిక దళం.. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ స్టోరీ!

భారత వైమానిక దళం (IAF) మే 8, 10 మధ్య ఒక ఖచ్చితత్వంతో కూడిన దాడులతో పాకిస్తాన్‌లోని 11 సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.

By:  Tupaki Desk   |   14 May 2025 1:01 PM
శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భారత వైమానిక దళం.. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ స్టోరీ!
X

పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి.. దేశాన్ని రక్షించిన తీరుకు యావత్ దేశం జేజేలు పలుకుతోంది. అయితే, 2025లో అత్యంత శక్తివంతమైన దేశాల సైనిక విమానాల జాబితాలో భారత వైమానిక దళం 4వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, టర్కీ వంటి బలమైన దేశాల కంటే వైమానిక దళం ముందుంది. ఈ ఘనత మన దేశానికి గర్వకారణం. ఆపరేషన్ సింధూర్ గురించి భారత వైమానిక దళం సాధించిన ఇతర విజయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రపంచంలోని వివిధ దేశాల వైమానిక దళాల సామర్థ్యాలను అంచనా వేయడానికి 'గ్లోబల్ ఫైర్‌పవర్ 2025' ఒక ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్ ఆయా దేశాల వద్ద ఉన్న మొత్తం సైనిక విమానాల సంఖ్య ఆధారంగా రూపొందించారు. ఈ జాబితా ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు (13,043 విమానాలు), రష్యా (4,292 విమానాలు), చైనా (3,309 విమానాలు) తర్వాత భారతదేశం 2,229 విమానాలతో 4వ స్థానంలో నిలిచింది.

2025లో అత్యధిక సైనిక విమానాలు కలిగిన దేశాల పూర్తి జాబితా

* అమెరికా సంయుక్త రాష్ట్రాలు – 13,043 విమానాలు

* రష్యా – 4,292 విమానాలు

* చైనా – 3,309 విమానాలు

* భారతదేశం – 2,229 విమానాలు

* దక్షిణ కొరియా – 1,592 విమానాలు

* జపాన్ – 1,443 విమానాలు

* పాకిస్తాన్ -1,399 విమానాలు

* ఈజిప్ట్ -1,093 విమానాలు

* టర్కీ -1,083 విమానాలు

* ఫ్రాన్స్ -976 విమానాలు

అక్టోబర్ 8, 1932న బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక దళంగా భారత వైమానిక దళం స్థాపించారు. కాలక్రమేణా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళాలలో ఒకటిగా ఎదిగింది. వివిధ సైనిక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి అధికారిక విమానం ఏప్రిల్ 1, 1933న జరిగింది. భారత వైమానిక దళం గతంలో పాకిస్తాన్‌తో 1947-1948, 1965, 1971 (బంగ్లాదేశ్ యుద్ధం), 1999 (కార్గిల్ యుద్ధం)లో పోరాడింది. ఇటీవలే మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో పొరుగు దేశం నుండి వచ్చిన క్షిపణులు, డ్రోన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది.

* 1961లో IAF గోవాను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సాయం చేసింది.

* 1962లో చైనా సైన్యంతో (సినో-ఇండియన్ యుద్ధం) జరిగిన పోరాటంలో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది.

* 1984లో, IAF సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

భారత వైమానిక దళం (IAF) మే 8, 10 మధ్య ఒక ఖచ్చితత్వంతో కూడిన దాడులతో పాకిస్తాన్‌లోని 11 సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల ఉపగ్రహ చిత్రాలు పొరుగు దేశానికి విస్తృతమైన నష్టం వాటిల్లిందని చూపిస్తున్నాయి. నూర్ ఖాన్ (చక్లాలా), రఫికి, మురిద్, సుక్కూర్, సియాల్‌కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కార్డు, భోలారి, జాకోబాబాద్‌లోని స్థావరాలు ఈ దాడులలో ధ్వంసమయ్యాయి.

మే 12, 2025న న్యూఢిల్లీలో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' పై విలేకరుల సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎకె భారతి మాట్లాడుతూ.. భారత స్పందన ఉద్దేశపూర్వకంగా అత్యంత విలువైన లక్ష్యాలపై కేంద్రీకరించబడినట్లు నొక్కి చెప్పారు. ఈ దాడులు కీలకమైన ఉగ్రవాద శిబిరాలపై జరిగాయి. ఫలితంగా ముఖ్యమైన లక్ష్యాలతో సహా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. లక్ష్యాలలో బహవల్‌పూర్ (జైషే-మహ్మద్), మురిద్కే (లష్కరే-తైబా)లోని శిబిరాలు ఉన్నాయి. ఈ ఆపరేషన్లో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి ఉగ్రవాదులు కూడా హతమయ్యారని సమాచారం.