రైలు నుంచి క్షిపణి.. ప్రయోగం సక్సెస్.. శుత్ర దేశాలకు వణుకు..
గత 11 సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం భారతీయులను క్షణ క్షణం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది.
By: Tupaki Desk | 25 Sept 2025 1:00 PM ISTగత 11 సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం భారతీయులను క్షణ క్షణం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. కేవలం భారతీయులనే కాదు.. ప్రపంచాన్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. డిఫెన్స్ రంగంలో భారత్ తయారు చేస్తున్న ప్రతి క్షిపణి ప్రయోగం సక్సెస్ అవుతూనే ఉంది. ప్రతి ప్రయోగం శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తుండగా.. మిత్ర దేశాలు ఆయా దేశాల ఆయుధ సంపత్తి కోసం భారత్ పై ఆధారపడుతున్నాయి. ఇది నయా భారత్ ఇది ఏదైనా చేస్తుందన్న విషయం ప్రపంచానికి చూపిస్తోంది.
అమ్ములపొదిలోకి అగ్ని ప్రైమ్
భారత అమ్ముల పొదిలో కీలకమైన క్షిపణి చేరింది. డీఆర్‌డీవో, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC), సైన్యం సహకారంతో అగ్ని-ప్రైమ్ (Agni-Prime)ను విజయవంతంగా ప్రయోగించింది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఒడిశా లోని డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం ఐల్యాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారత విజయగాథకు మరో గర్వించతగ్గే క్షణం తోడైంది. ఈ క్షిపణి రైల్ ఆధారిత మొబైల్-లాంఛర్ నుంచి ప్రయోగించడం భారత సామర్థ్యాల్లో ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుంది.
రైల్ నుంచి ప్రయోగం..
ఇప్పటి వరకు మనం నేలపై, నీటిపై, నీటిలో, గాలి నుంచి క్షిపణులను ప్రయోగించాం. నేలపై అంటే పెద్ద పెద్ద ట్రక్కులు, భారీ వాహనాలపై నుంచి మాత్రమే. కానీ ఇప్పుడు ఆ వాహనాల్లోకి రైల్ వచ్చి చేరింది. రైల్ నుంచి క్షిపణి ప్రయోగం చేసి భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ తో ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. పట్టాలపై రవాణా చాల వేగంగా ఉంటుంది. రోడ్డుపై నుంచి కంటే ఎక్కువ రేట్ల ఉంటుంది. కాబట్టి శుత్రు దేశాల బార్డర్ వరకు వేగంగా ఈ క్షిపణులను తరించవచ్చు ప్రయోగించవచ్చు.
ఎక్కువ రేట్లు ఫలితాలు..
రైల్ నుంచి కూడా ప్రయోగించే ఈ క్షిపణితో రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి క్యానిస్టర్ (డబ్బాలాగా) ఆధారిత నిర్మాణం. ఇందులో ఎక్కువ పేలుడు పదార్థాలను నిల్వ చేయవచ్చు. మేనేవర్ చేయగల రీఏంట్రీ వాహకం (MaRV), అధిక ఖచ్చితత్వం ఇవన్నీ అగ్ని ప్రైమ్ స్థిరత్వం, మొబిలిటీని పెంచుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2,000 కిలోమీటర్ల పరిధిని ఈ మిస్సయిల్ ఛేదిస్తుంది. మొత్తానికి ఈ ప్రయోగం ఒకవైపు దేశీయ శాస్త్ర, సాంకేతిక ప్రగతికి ముద్ర అని చెప్పుకోవాలి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీఓ, సైన్యానికి అభినందనలు తెలిపారు.
సాంకేతికతను వ్యూహపూర్వకంగా, బాధ్యతాయుతంగా వినియోగిస్తేనే నిజమైన విజయం సిద్ధిస్తుందని ఈ ప్రయోగం చూస్తే తెలుస్తుంది.
