Begin typing your search above and press return to search.

అగ్ర‌రాజ్యంలో ఆగ‌ని తుపాకీ.. 4 రోజుల్లో 400 మంది హ‌త్య‌

ఈ ప‌రిణామంపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌, ఆవేద‌న కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 Jan 2024 9:30 AM GMT
అగ్ర‌రాజ్యంలో ఆగ‌ని తుపాకీ.. 4 రోజుల్లో 400 మంది హ‌త్య‌
X

ప్ర‌పంచానికి తాము ఆద‌ర్శ‌మ‌ని చెప్పుకొనే అగ్ర‌రాజ్యం.. పెద్ద‌న్న అమెరికాలో తుపాకీ మోత‌లు ఆగ‌డం లేదు. చిన్న‌దానికీ. పెద్ద‌దానికీ.. తుపాకీనే స‌మాధానం చెబుతోంది. విచ‌క్షణ లేని వ్య‌వ‌హారంతో తుపాకీ మోత‌లు పేట్రేగుతున్నాయి. దీంతో కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల్లో ఏకంగా 400 మంది హ‌త్యకు గుర‌య్యారు. ఈ ప‌రిణామంపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌, ఆవేద‌న కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు అమాయ‌కుల ప్రాణాల‌ను బలిగొంటున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులే కాల్పులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. 2024 వ‌చ్చి ఐదు రోజులు మాత్ర‌మే గ‌డ‌వ‌గా.. తొలి నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా 400 మంది తుపాకీ తూటాలకు బలైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

దీనిపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తీవ్రంగా స్పందించారు. వాటిని ఎలా అణచివేయాలో తెలుసన్నారు. దేశ వ్యాప్తంగా విస్త్రృత తనిఖీలు నిర్వహించడంతోపాటు, గతంలో అమలు చేసిన ఆయుధ నిషేధాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు.

త‌ర‌గ‌తి గ‌దిలో ర‌క్త‌పాతం

అయోవా రాష్ట్రంలోని పెర్రీ హై స్కూల్‌లో గురువారం 17 ఏళ్ల విద్యార్థి తరగతి గదిలోనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా స్కూల్‌ ప్రిన్సిపల్‌తో సహా ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో తరగతి గది భీతావహంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి కమలా హారిస్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా నివాళులర్పించారు.