Begin typing your search above and press return to search.

లోకేష్ నోటీసులో కీలక అంశాలు...!

టీడీపీ నాయకుడు నారా లోకేష్ కి ఏపీ సీఐడీ అధికారులు సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో కీలక అంశాలను ప్రస్తావించారని తెలుస్తోంది. హెరిటేజ్ బోర్డు మీటింగ్ మినిట్స్ ని చెప్పాలని అడిగారని అడిగినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Sep 2023 1:14 PM GMT
లోకేష్ నోటీసులో కీలక అంశాలు...!
X

టీడీపీ నాయకుడు నారా లోకేష్ కి ఏపీ సీఐడీ అధికారులు సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో కీలక అంశాలను ప్రస్తావించారని తెలుస్తోంది. హెరిటేజ్ బోర్డు మీటింగ్ మినిట్స్ ని చెప్పాలని అడిగారని అడిగినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా హెరిటేజ్ బ్యాంక్ లావాదేవీల వివరాలను కూడా లోకేష్ ని కోరినట్లుగా చెబుతున్నారు.

ఇక హెరిటేజ్ తరఫున కొన్న భూముల లావాదేవీలు ఆ వివరాలు కూడా అడిగినట్లుగా తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు లోకేష్ కి ఇచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇక హెరిటేజ్ సంస్థకు సంబంధించి లోకేష్ అప్పట్లో కీలక పాత్ర పోషించారు అన్న దాని మీదనే ఆధారం చేసుకుని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇక నోటీసులను అందుకున్న లోకేష్ తాను ఏ రకమైన జవాబు అయినా చెబుతాను అని సీఐడీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా తాను సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేయను అని అన్నట్లుగా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే ఈ విచారణలో భాగంగా అవసరం అయితే కోర్టు ముందు కూడా లోకేష్ హాజరు కావాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక నారా లోకేష్ తన నోటీసులు తీసుకున్నారని ఆయనకు సెక్షన్ 41ఏ మీద వివరణ ఇచ్చామని కూడా తెలిపారు.

ఇన్నర్ రింగ్ రోడు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందని ఈ కేసులో ఏ 14 గా లోకేష్ పేరు పెట్టి ఆయనకు నోటీసులు ఇచ్చిన సీఐడీ ఆయన కనుక విచారణలో తమకు సహకరించకపోతే కోర్టు ముందు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారుట. అలా కోర్టు అనుమతి తీసుకుని కస్టడీలోకి తీసుకోవాలని కూడా ఆలోచన ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే సీఐడీ ఇచ్చిన నోటీసుల మీద నారా లోకేష్ తన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సీఐడీ విచారణకు లోకేష్ హాజరైతే ఏమవుతుంది, హాజరు కాకపోతే ఏమవుతుంది అన్న కోణాలలోనూ న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.