Begin typing your search above and press return to search.

అయోధ్యకు యాత్రికుల విషయంలో కీలక విషయాలు... ఇకపై కోట్లలోనే!

ఈ సమయంలో అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ కీలక విషయాలు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 1:36 PM GMT
అయోధ్యకు యాత్రికుల విషయంలో  కీలక విషయాలు... ఇకపై కోట్లలోనే!
X

సుమారు 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం ఎట్టకేలకు సాకారమైన సంగతి తెలిసిందే. నవనిర్మాణ రామాలయం గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరిన క్షణాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు వీక్షించారు. ఈ క్రమంలో జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ కీలక విషయాలు వెల్లడించింది.

అవును... వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడి ఆలయం ప్రారభమైంది. ఈ సందర్భంగా గర్భగుడిలో నీలమేఘశ్యాముడు కొలువయ్యారు. ఈ సమయంలో బాలరాముడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రతీరోజూ సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు బాల రాముని సందర్శించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది.

ఫలితంగా... దేశంలో నూతన పర్యాటక కేంద్రంగా అయోధ్య మారనుందని జెఫరీస్ గ్రూప్ అభిప్రాయ పడింది. ఇందులో భాగంగా... రామాలయ ప్రారంభోత్సవం అనంతరం ఏడాదికి సుమారు 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ గ్రూప్ అంచనా వేసింది. కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, అప్ డేట్ చేసిన రైల్వేస్టేషన్‌ తో ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నట్లు తెలిపింది.

ఈ నెల 23వ తేదీ నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారని తెలుస్తున్న నేపథ్యంలో... హోటళ్లు, విమానయానం, ప్రయాణ అనుబంధ రంగాలు ప్రయోజనం పొందనున్నాయని తెలుస్తుంది. ఫలితంగా... దేశ టూరిజానికి ఇదో నూతన మోడల్‌ గా మారనుందని.. ఇదే సమయంలో ఇకపై అయోధ్య అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించనుందని జెఫరీస్‌ వెల్లడించింది.

కాగా... ఉత్తరప్రదేశ్‌ అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఇప్పటికే హోటళ్ల బుకింగ్స్‌ సుమారు 80 శాతం మేరకు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ నెల 23 నుంచి నార్మల్ హోటల్ నుంచి లగ్జరీ హోటల్ వరకూ రూం బుకింగ్ ధరలు గతంలో కంటే సుమారు ఐదు నుంచి 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది.