Begin typing your search above and press return to search.

ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన!

తాజాగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌ లుక్‌ పేరుతో ఐఎంఎఫ్‌ నివేదికను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 11:30 AM GMT
ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన!
X

ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కీలక ప్రకటన వెలువరించింది. అమెరికా, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన, ఆధునిక, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఉటంకిస్తూ 2014 ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్‌ 3.1 శాతానికి పెంచింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

తాజాగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌ లుక్‌ పేరుతో ఐఎంఎఫ్‌ నివేదికను విడుదల చేసింది. ఇందులో నవీకరించబడిన గణాంకాలు.. అక్టోబర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి మునుపటి అంచనా కంటే 0.2 శాతం ఎక్కువ కావడం విశేషం.

ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్‌ లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అగ్ర రాజ్యం అమెరికా వృద్ధి పయనంలో ఉండటం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం నెమ్మదించడం ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.

తాజా అవుట్‌ లుక్‌ లో 2024 వృద్ధిరేటును ఇంతకుముందు 2.9 శాతంగా ప్రకటించగా దాన్ని తాజాగా 3.1 శాతానికి పెంచింది. ఇక 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, 2024లో ఇది 5.8 శాతానికి, 2025లో 4.4 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.

అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6 శాతం ఉంటే 2024లో 2 శాతానికి ఇది తగ్గుతుందని ఐఎంఎఫ్‌ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3 శాతంగా ఉంటే, 2025లో 3.6 శాతానికి పెరుగుతుందని పేర్కొంది.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలయిన జీ–7తోపాటు, ఐరోపా దేశాలలో వృద్ధి బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఇది కొనసాగుతున్న సవాళ్లను ప్రతిబింబిస్తోందని వెల్లడించింది. అయితే జీ–7 దేశాల్లో సభ్యత్వం ఉన్న జపాన్, కెనడా కొంచెం మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది.

2024కి ప్రపంచ ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఇది ధనిక, పేద దేశాల మధ్య గణనీయమైన మార్పుకు కారణమవుతుందని పేర్కొంది.