లోన్ డబ్బులు 11 రోజులు.. ఆయుధ నిల్వలు 12 రోజులు!
అవును.. పాకిస్థాన్ కు ఆర్థిక సంస్కరణ, క్లైమేట్ రెసిస్టెన్స్ కార్యక్రమాల కింద సుమారు 2.4 బిలియన్ డాలర్లను పంపిణీ చేసింది ఐఎంఎఫ్!
By: Tupaki Desk | 10 May 2025 4:00 PM ISTఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు.. పాకిస్థాన్ కు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై జమ్మూకశ్మీర్ సహా పలువురు భారతీయులు మండి పడుతున్నారు. ఈ సమయంలో ఐఎంఎఫ్ బోర్డు పాకిస్థాన్ కు చెందిన రెండు ఆర్థిక నిర్ణయాలను ఆమోదించింది. ఫలితంగా.. సుమారు 2.4 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.
అవును.. పాకిస్థాన్ కు ఆర్థిక సంస్కరణ, క్లైమేట్ రెసిస్టెన్స్ కార్యక్రమాల కింద సుమారు 2.4 బిలియన్ డాలర్లను పంపిణీ చేసింది ఐఎంఎఫ్! మే9న జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం తర్వాత.. ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ద్వారా మద్దతు ఇవ్వడానికి పాకిస్థాన్ ఆర్ధిక సంస్కరణ యొక్క మొదటి సమీక్షను పూర్తిచేసినట్లు ఐఎంఎఫ్ తెలిపింది.
దీని ద్వారానే ఆ దేశానికి సుమారు ఒక బిలియన్ డాలర్ల తక్షణ చెల్లింపు సాధ్యమవుతుందని వెల్లడించింది. ఇక రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద ఒక ఏర్పాటు కోసం పాకిస్థాన్ చేసిన అభ్యర్థనను ఆమోదించిన ఐఎంఎఫ్ బోర్డు.. దీని ద్వారా $1.4 డాలర్లు ఇస్తుంది. ఇలా మొత్తం సుమారు 2.4 బిలియన్ డాలర్లు పాకిస్థాన్ కు చేరుకుంటాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ వేదికగా సెటైర్లు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పాక్ ఖర్చులు.. ఈ అప్పుల లెక్కలు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా... పాక్ వారానికి చేసే ఖర్చు 1.35 బిలియన్ డాలర్లు అయితే... ఐఎంఎఫ్ ఇచ్చిన అప్పు 2.4 బిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. అంటే... తాజా లోన్ పాకిస్థాన్ కు 11 రోజులకు సరిపోతుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరోపక్క... ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న మందుగుండు, యుద్ధానికి సరిపోయే నిల్వలు కేవలం 12 రోజులకు మాత్రమే సరిపోతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో.. రెండు వారాల్లోపు అన్ని రకాలుగానూ పాక్ చతికిలపడిపోవడం ఖాయమని అంటున్నారు!