Begin typing your search above and press return to search.

శుక్రవారం అర్థరాత్రి ఐమాక్స్ లో రచ్చ..అసలేం జరిగింది?

టైగర్ ష్రాప్ నటించిన 'గణపత్' మూవీకి వచ్చిన ప్రేక్షకులు.. సినిమా చూస్తున్న వేళ భరించలేని దుర్వాసన వచ్చింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 6:07 AM GMT
శుక్రవారం అర్థరాత్రి ఐమాక్స్ లో రచ్చ..అసలేం జరిగింది?
X

ఇప్పుడంటే బోలెడన్ని థియేటర్లు వచ్చేశాయి కానీ.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ అన్నంతనే ఐమ్యాక్స్ అన్న టైం కొంతకాలం నడిచింది. సినిమాల్ని ప్రేమించేవారు.. అభిమానించేవారు హైదరాబాద్ కు వస్తే.. ఈ తొలి మల్టీఫ్లెక్సుకు వచ్చేవారు. ఇప్పటికి.. ఏదైనా పెద్ద హీరో మూవీ విడుదలైతే.. ఐమ్యాక్స్ లో చూసి ఎంజాయ్ చేసే వారు వేలాదిగా ఉంటారు. ఈ కారణంతోనే.. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. యూట్యూబర్లు.. వెబ్ సైట్లకు చెందిన వారు సినిమా బజ్ గురించి తెలుసుకోవటానికి ఐమ్యాక్స్ వద్ద కాపు కాస్తుంటారు.

అలాంటి ఐమ్యాక్స్ థియేటర్ లో శుక్రవారం అర్థరాత్రి వేళలో చోటు చేసుకున్న రచ్చ చర్చనీయాంశంగా మారింది. టైగర్ ష్రాప్ నటించిన 'గణపత్' మూవీకి వచ్చిన ప్రేక్షకులు.. సినిమా చూస్తున్న వేళ భరించలేని దుర్వాసన వచ్చింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల వేళలో ఈ ఫరిణామం చోటు చేసుకుంది. షో మధ్యలో భరించలేని వాసన రావటంతో ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో స్పందించిన సిబ్బంది.. రూం స్ప్రేయర్లు కొడతామని చెప్పారు.

అయినప్పటికీ దుర్వాసన ఆగకపోవటం.. భరించలేనంతగా మారటంతో.. ధియేటర్ నుంచి బయటకు వచ్చేశారు. షో నిలిచిన కారణంగా తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే.. అక్కడి సిబ్బంది వాదనకు దిగటంతో ఇష్యూ రచ్చగా మారింది.

తమకు అందిన సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇష్యూను పెద్దది చేయకుండా ఉండేందుకు టికెట్ డబ్బుల్ని ప్రేక్షకులకు ఇవ్వటమే మంచిదన్న అభిప్రాయంతో ఏకీభవించిన వారు.. చివరకు డబ్బులు ఇచ్చేశారు. దీంతో.. వివాదం సద్దుమణిగింది. ఈ తరహా ఘటన చోటు చేసుకోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.