Begin typing your search above and press return to search.

అమెరికా సరిహద్దుల్లో దొరికిన భారతీయులు.. నెంబర్ తెలిస్తే షాకే!

అవును... అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్కడి అధికారులకు దొరికిపోయిన భారతీయుల సంఖ్య షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   3 July 2025 1:00 AM IST
అమెరికా సరిహద్దుల్లో  దొరికిన భారతీయులు.. నెంబర్  తెలిస్తే షాకే!
X

అమెరికాలోని అక్రమ వలసదారులను వెంటనే తరిమేయాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా చూడాలని.. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అధికారులను ఆదేశిస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో దొరికిపోయిన భారతీయుల నెంబర్ షాకింగ్ గా ఉంది. దీంతో.. ట్రంప్ ఆవేదనలో అర్ధముందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్కడి అధికారులకు దొరికిపోయిన భారతీయుల సంఖ్య షాకింగ్ గా మారింది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారని చెబుతున్నారు. వీరిలో పెద్దల రక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్న్నారని అధికారులు వెల్లడించారు.

ఇలా అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తూ దొరికిపోయినవారిలో ఎక్కువమంది గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వారున్నారని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన డేటాను అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం విడుదల చేసింది. ఇదే సమయంలో... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ లెక్కలు చాలా తగ్గాయని చెబుతోంది!

వాస్తవానికి గతేడాది ఇదే సీజన్‌ లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. ఆ లెక్కన చూసుకుంటే... ఈ ఏడాది సుమారు 70శాతం తగ్గుదల నమోదైనట్లే. అంటే... జోబైడెన్‌ ప్రభుత్వ హయాంలో రోజుకు 230 మంది వరకు అరెస్ట్‌ అవ్వగా... ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు సగటున 69 మంది అరెస్ట్‌ అయ్యారు.

డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్‌ 2024 నాటికి అమెరికాలో సుమారు 2.2 లక్షల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. అదే సమయంలో... తల్లిదండ్రులు వదిలేసిన 500 మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే... ఈ ఏడాది జనవరి నుంచి 332 మందిని అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు.

దీనికి కారణం... అమెరికా - మెక్సికో, అమెరికా - కెనడా సరిహద్దుల్లో చాలా మంది తల్లితండ్రులు.. తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్లేవారని చెబుతున్నారు. దీంతో... తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయస్సు 12 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటోందని.. అప్పుడప్పుడూ అంతకంటే చిన్నవారు ఉంటున్నారని అంటున్నారు.