Begin typing your search above and press return to search.

మోడీ హ్యాట్రిక్ కొడితే జాతీయ పార్టీ రెండు ముక్కలు ?

కాంగ్రెస్ హిస్టరీలో ఇంత లాంగ్ టైం విపక్షంలో ఉండడం ఎపుడూ లేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 May 2024 3:30 AM GMT
మోడీ హ్యాట్రిక్ కొడితే జాతీయ పార్టీ రెండు ముక్కలు ?
X

కేంద్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారడానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మరోసారి అధికారంలోకి వస్తే ఇక తిరుగులేదు అని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే ఈసారి బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ మరింతగా దెబ్బ తింటుందని ఆ పార్టీ అంచనా కడుతోంది. కాంగ్రెస్ హిస్టరీలో ఇంత లాంగ్ టైం విపక్షంలో ఉండడం ఎపుడూ లేదు అని అంటున్నారు.

కాంగ్రెస్ ఫస్ట్ టైం మూడేళ్ల పాటు విపక్షంలో ఉంది. అది 1977లో జరిగింది. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికలతో పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ కి చుట్టుకోవడంతో ఆ పార్టీ ఓడి జనతా ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. అలా మూడేళ్ళు కాంగ్రెస్ విపక్షంలో ఉన్నా ఇందిరాగాంధీ చాకచక్యంతో 1980 నాటికి తిరిగి పార్టీని అధికారంలోకి వచ్చేలా చూసారు.

ఇక రెండవమారు ఇందిర కుమారుడు రాజీవ్ ని మాజీ ప్రధానిగా చేసి నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రభుత్వం కూడా రెండేళ్ళకే కుప్ప కూలింది. మళ్ళీ 1991లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. ఇక 1996 నుంచి చూస్తే 2004 వరకూ కాంగ్రెస్ కి గడ్డు పరిస్థితి అని చెప్పాలి. అంటే సుమారుగా ఎనిమిదేళ్ళ కాలం అన్న మాట.

కాంగ్రెస్ అలా పడుతూ లేస్తూ అప్పట్లో పార్టీని కాపాడుతుంది. సోనియా గాంధీ నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ కి అధికారం దక్కింది. అలా రెండు టెర్ములు కాంగ్రెస్ పవర్ లో ఉంది. 2014లో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. 2019లో కాంగ్రెస్ దే అధికారం అనుకుంటే అది జరగలేదు. దాంతో కాంగ్రెస్ పదేళ్ల పాటు విపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే కాంగ్రెస్ కి సుదీర్ఘం అనుకుంటే ఈసారి కనుక కాంగ్రెస్ ఓడితే మరో అయిదేళ్ళు అంటే పదిహేనేళ్ల పాటు అధికారానికి కాంగ్రెస్ దూరం అయితే ఏమైనా ఉంటుందా అన్నదే చర్చ.

సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకునే బీజేపీ కూడా మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఈసారి కనుక తాము అధికారంలోకి వస్తే దేశంలో కాంగ్రెస్ అన్నది ఉండదు అన్నది కమలనాధుల ధీమగా ఉంది. కాంగ్రెస్ లో సోనియా గాంధీ ఇపుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రియాంక రాహుల్ గాంధీల మీదనే భారం అవుతుంది. అపుడు పార్టీలో మిగిలిన సీనియర్లు కూడా తమ దారి తాము చూసుకుంటారు అన్నది బీజేపీ అంచనాగా ఉందని అంటున్నారు.

కాంగ్రెస్ పతనం గురించి కర్నాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత బొమ్మై సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా ఆయన తనదైన శైలిలో జోస్యం చెప్పారు అని కూడా అనుకోవాలి. బీజేపీ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అదే సమయంలో జాతీయ స్థాయిలో నిట్టనిలువునా కాంగ్రెస్ చీలడమూ ఖాయమని ఆయన అంటున్నారు.

అంటే మోడీ హ్యాట్రిక్ తరువాత జాతీయ స్థాయిలో రాజకీయంగా సంభవించే అతి పెద్ద కీలక పరిణామం గానే దీనిని ఆయన చెబుతున్నారు. అంతే కాదు కర్నాటకలో సైతం కాంగ్రెస్ నాయకులు అంతా గొడవ పడి ప్రభుత్వాన్ని పతనం చేసుకుంటారు అని మరో బాంబు వేశారు. ఇక మోడీ మళ్లీ ప్రధాని అయితే విపక్ష పాలిత రాష్ట్రాలలో అంటే కర్నాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు ముప్పు తప్పదని కూడా విశ్లేషణలు వస్తున్న నేపధ్యంలో బొమ్మై వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

బీజేపీ అంచనాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కి మళ్లీ అధికారం దక్కకపోతే పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అలవాటు లేని ఖద్దరు పార్టీ నేతలు ఏ విధంగా మారుతారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం ఒక చర్చకు దారి తీస్తోంది.