Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో ఘోరం... హైదరాబాద్ మహిళ దారుణ హత్య!

భర్త ఆశోక్ రాజ్ ఆమెను హత్యమార్చాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   10 March 2024 6:33 PM IST
ఆస్ట్రేలియాలో ఘోరం... హైదరాబాద్  మహిళ దారుణ హత్య!
X

ఈ ఏడాది విదేశాల్లో జరిగిన పలు ప్రమాదాలు, మరిన్ని దాడుల్లో మృతిచెందిన భారతీయుల జాబితాలో తాజాగా మరొకరు చేరారు. ఇటీవల కాలంలో విదేశాల్లో అత్యంత విషాదకర ఘటనల్లో పలువురు భారతీయులు మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన మహిళ ఆస్ట్రేలియాలో దారుణహత్యకు గురైంది.

అవును... ఆస్ట్రేలియాలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన మహిళ దారుణహత్యకు గురయ్యింది. ఆస్ట్రేలియాలో విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న ఒక చెత్తకుండీలో ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు! ఆస్ట్రేలియాలో భార్యను చంపేసిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ రాజ్ హైదరాబాద్ కు వచ్చినట్లు చెబుతున్నారు.

అలా కుమారుడిని తీసుకుని హైదారాబాద్ కు వచ్చిన అశోక్... అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ సమయంలో కేసును దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు... అశోక్ రాజే హతమార్చినట్లు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం!