Begin typing your search above and press return to search.

షాకింగ్ : హైదరాబాద్ లో కూడా ఢిల్లీ ప్రయోగం ?

ఢిల్లీలో సమస్యల పరిష్కారానికి అనుసరించిన సరి-బేసి సంఖ్యల ప్రయోగాన్ని హైదరాబాద్ లో కూడా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 9:30 AM GMT
షాకింగ్ : హైదరాబాద్ లో కూడా ఢిల్లీ ప్రయోగం ?
X

ఢిల్లీలో సమస్యల పరిష్కారానికి అనుసరించిన సరి-బేసి సంఖ్యల ప్రయోగాన్ని హైదరాబాద్ లో కూడా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది అని ఒక ప్రచారం స్టార్ట్ అయ్యింది . ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సరి బేసి ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. సరి బేసి ప్రయోగం అంటే వాహనాలను రోడ్డుపైకి అనుమతించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మార్గం. నెంబర్లలో సరి నెంబర్లు (ఈవెన్) ఉన్న వాహనాలు, బేసి(ఆడ్) నెంబర్లున్న వాహనాలని రెండురకాలుగా వర్గీకరించింది.

ఈవెన్ నెంబర్లున్న వాహనాలు ఒకరోజు ఆడ్ నెంబర్లున్న వాహనాలు ఒకరోజు రోడ్డుపైకి రావాలన్న నిబంధన విధించింది. దీనివల్ల ఏమైందంటే వాయు కాలుష్యం తగ్గటంతో పాటు ట్రాపిక్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. వాయుకాలుష్యం పెరిగిపోవటంతో జనాలు ఆక్సిజన్ మాస్కులను పెట్టుకుని తిరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కాలుష్యం దెబ్బకు వేలమంది అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలకు స్కూళ్ళకు శెలవులు కూడా ఇచ్చేస్తున్నారు. అయితే పరిస్ధితిని అర్ధంచేసుకోకుండా అడ్డుగోలుగా వాదించే వాళ్ళు ఎక్కడైనా ఉంటార కదా. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు కోర్టుకు కూడా వెళ్ళారు.

అయితే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకున్న కోర్టు పిటీషన్లను అనుమతించలేదు. దాంతో కేజ్రీవాల్ ప్రభుత్వం స్వేచ్చగా నిబంధనలను కొంతకాలం అమలుచేసింది. దానివల్ల కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గినట్లు నిపుణులు ప్రకటించారు. తర్వాత కాలంలో ఎందుకనో ఆ ప్రయోగం అటకెక్కిపోయింది. ఇపుడు అలాంటి ప్రయోగాన్నే హైదరాబాద్ లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు .

ఇదే విషయంపై హైదరాబాద్ పోలీసు కమీషనర్ శ్రీనివాసరెడ్డి కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు . హైదరాబాద్ నగరం పరిధిలో 240 కిలోమీటర్ల రోడ్లున్నాయి. అయితే వాహనాలు 84 లక్షలున్నాయి. అంటే రోడ్ల స్ధాయికి మించి వాహనాలు పెరిగిపోయాయి. వీటిల్లో ద్విచక్ర వాహనాలే సుమారు 50 లక్షలున్నట్లు అంచనా. కార్లు, ఆటోలు, ట్రాలీలు, ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు మిగిలినవి. ఇందులో కూడా సొంతకార్లు, క్యాబ్ ల సంఖ్య సుమారు 20 లక్షలుంటాయని లెక్కకట్టారు. ఇందులో కూడా కాలంచెల్లినవే ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి వాతావరణ కాలుష్యంతో పాటు ట్రాపిక్ సమస్యలను కంట్రోల్ చేయాలంటే ఆడ్-ఈవెన్ నెంబర్ వెహికల్స్ నియంత్రణే బెస్టని నిపుణులు అనుకుంటున్నారు. మరీ ప్రయోగం ఎప్పటినుండి అమలవుతుందో చూడాలి.