Begin typing your search above and press return to search.

కోకాపేట భూముల ఎఫెక్ట్... నెక్స్ట్ రెండు ప్లేస్ లు రెడీ!

హైదరాబాద్‌ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో హెచ్.ఎం.డి.ఏ. భూముల వేలం జరుగుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Aug 2023 7:41 AM GMT
కోకాపేట భూముల ఎఫెక్ట్... నెక్స్ట్ రెండు ప్లేస్ లు రెడీ!
X

హైదరాబాద్‌ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో హెచ్.ఎం.డి.ఏ. భూముల వేలం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఫేజ్‌ 2లో 6,7, 8, 9 ప్లాట్లకు హెచ్‌ఎండీ వేలం వేసింది. ఈ వేలంలో గజం ధర సరాసరి రూ.1.5 లక్షలుగా ఉంది. ఈ సందర్భంగా... రికార్డు స్థాయి ధర పలికి దుమ్ము దులిపేసింది కోకాపేట్ నియోపోలిస్.

అవును... ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్‌ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. కోకాపేట నియోపోలీస్‌ భూములు వేలంలో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించింది. ఈ సమయంలో మోకిల, బుద్వేల్‌ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఈ నెల 7న మోకిల ప్లాట్లను హుడా వేయనుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు ఈరోజుతో ముగియనుంది! ఇందులో మొత్తం 165 ఎకరాల 37 గుంటలలో 1321 ప్లాట్లు ఉండగా... మొదటి దఫాలో 50 ప్లాట్ లకు వేలం జరగనుందని తెలుస్తోంది. ఒకపక్క కోకా పేట భూములు కోట్లు పలకడంతో... ఇప్పుడు అందరి దృష్టి మోకిలా వైపు ఉందని అంటున్నారు.

వెస్ట్ సిటీ హబ్‌ గా మోకిల రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... నగరంలోని కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన నేపథ్యంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో భాగంగా... రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌ లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా.. మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్.ఎం.డి.ఏ. ద్వారా విక్రయించనున్నారు. బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు.

వీటికి సంబంధించి ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. వీటిలో ఎకరాకు కనీస ధరను రూ.20 కోట్లగా నిర్ణయించారు. ఈ భూముల వేలానికి సంబంధించి ఆరో తేదీన ప్రీబిడ్ సమావేశం, ఎనిమిదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

అనంతరం ఈ నెల 10న ఈ -వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున రూ.30కోట్ల ధరకు అమ్ముడుపోయినా.. కనీసం రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తోందని తెలుస్తోంది.