Begin typing your search above and press return to search.

ప్రేమ పెళ్లి చేసుకున్న శ్వేతను ఇంత దారుణంగా హతమార్చటమా?

ఆమె గురించి.. ఆమె ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   11 March 2024 5:19 AM GMT
ప్రేమ పెళ్లి చేసుకున్న శ్వేతను ఇంత దారుణంగా హతమార్చటమా?
X

ఆస్ట్రేలియాలోని హైదరాబాదీ మహిళను ఆమె భర్తే హతమార్చిన వైనం ఆదివారం వెలుగు చూడటం.. దీనికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. షాకింగ్ గా మారిన శ్వేత అలియాస్ చైతన్య హత్యోదంతం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఆమె గురించి.. ఆమె ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కన ఉన్న డస్ట్ బిన్ లో శ్వేత డెడ్ బాడీని గుర్తించటం తెలిసిందే. ఆమెను హత్య చేసింది తానేనంటూ పోలీసుల ఎదుట భర్త లొంగిపోవటం.. దానికి ముందు తమ కొడుకును ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి అత్తారింట్లో వదిలిపెట్టి వెళ్లటం తెలిసిందే.

హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాల్ శెట్టి గౌడ్ కుమార్తెనే హత్యకు గురైన శ్వేత. మధుగాని చైతన్య అలియాస్ శ్వేతది ప్రేమ పెళ్లిగా ఆమె బంధువులంతా గుర్తు చేసుకుంటున్నారు. వారి పెళ్లిని రెండు ఫ్యామిలీలు పూర్తి స్థాయిలో అంగీకరించలేదని చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్వేత భర్త వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇక.. శ్వేత విషయానికి వస్తే.. అందరితో కలివిడిగా ఉండటం.. ఎవరికైనా ఏదైనా అవసరమైతే తాను ముందుండి వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తుందన్న విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మిర్కావే ప్రాంతంలో తరచూ నిర్వహించే సోషల్ వర్కులో చురుగ్గా పాల్గొనే ఆమె.. భర్త చేతిలోనే హత్యకు గురైందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా? జరిగిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూసే వీలుందని చెబుతున్నారు.

ఇంట్లోనే భార్య శ్వేతను కత్తితో పొడిచి.. ఆమె డెడ్ బాడీని బెడ్ షీట్ లో చుట్టుకొని గ్రీన్ కలర్ చెత్త డబ్బాలో ఉంచేసి.. దాన్ని తన వాహనంలో ఇంటికి 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉంచేసి వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో రోజుకు రెండు.. మూడు వాహనాలు కూడా తిరగవని పోలీసులు చెబుతున్నారు. అనంతరం కొడుకు తీసుకొని హైదరాబాద్ కు వచ్చేసి.. అత్తారింట్లో అప్పగించి తాను తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లి.. పోలీసుల ఎదుట లొంగిపోవటంతో ఈ హత్య వెనుక బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.