Begin typing your search above and press return to search.

రాడిసన్ డ్రగ్ పార్టీలో ఆ నటి పేరు!

సంచలనంగా మారిన రాడిసన్ డ్రగ్ పార్టీ వ్యవహారంలో కొత్త ముఖాలు తెర మీదకు వచ్చాయి

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:53 AM GMT
రాడిసన్ డ్రగ్ పార్టీలో ఆ నటి పేరు!
X

సంచలనంగా మారిన రాడిసన్ డ్రగ్ పార్టీ వ్యవహారంలో కొత్త ముఖాలు తెర మీదకు వచ్చాయి. గుట్టుచప్పుడు కాకుండా స్టార్ హోటల్ లో నిర్వహించిన డ్రగ్ పార్టీలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన యోగానంద్ కుమారుడు వివేకానంద దొరికిపోవటం.. అతడ్ని అరెస్టు చేయటం సంచలనంగా మారింది. డ్రగ్ పార్టీ ఇచ్చిన అతను.. డ్రగ్స్ ను సేవించినట్లుగా ఆధారాలు సేకరించటంతో పాటు.. రక్త పరీక్ష నిర్వహించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ పార్టీకి వచ్చిన వారెవరు? అన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. ప్రాథమికంగా పది మంది పేర్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ పేర్లలో ఒక నటి కూడా ఉండటం గమనార్హం. గతంలోనూ ఆమెపై డ్రగ్స్ కు సంబంధించిన లింకులు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. ఆమె వాటిని ఖండించింది. ఇంతకూ ఆమె ఎవరంటే చిట్టి వీడియోలు చేయటం.. షార్ట్ ఫిల్మ్స్ లో నటించే నటిగా గుర్తింపు పొందిన లిషిగా చెబుతున్నారు. యూట్యూబ్ వీడియోల్లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పార్టీకి వెళ్లినట్లుగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. జామెంట్రీ బాక్సు అనే షార్ట్ ఫిలింలో పాపులర్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో ఆమెను కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆసక్తికర విషయం ఏమంటే.. 2022లో మింక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు వినిపించింది. అయితే.. ఆ సమయంలో తనపై వచ్చిన ఆరోపణల్ని ఆమె ఖండించారు. తాను చీజ్ బజ్జీలు తినేందుకు వెళితే.. తనపై ఇంత దారుణ అభాండాలు వేస్తారా? అంటూ ప్రశ్నించింది. ఆమె చీజ్ బజ్జీ మాటకు తెగ ట్రోల్ అయ్యిందీ అమ్మడు.

తాజాగా రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో లిషి పేరు వినిపించటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి హాజరైన వారిలో బిజినెస్ ఉమెన్ గా పేరున్న శ్వేతను కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పేరును కూడా డ్రగ్ పార్టీకి వెళ్లిన లిస్టులో చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ హైప్రొఫైల్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే వీలుందన్న మాట వినిపిస్తోంది.