Begin typing your search above and press return to search.

శివారు భూముల వేలంలో కళ్లు చెదిరే ధరలు..

హైదరాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్. నగరం విస్తరిస్తున్న కొద్దీ స్థలాల రేట్లు పెరుగుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 Aug 2025 1:00 PM IST
శివారు భూముల వేలంలో కళ్లు చెదిరే ధరలు..
X

హైదరాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేది రియల్ ఎస్టేట్. నగరం విస్తరిస్తున్న కొద్దీ స్థలాల రేట్లు పెరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ నేడు ఊపు అందుకుటుంది. హైదరాబాదే కాదు.. మహా నగరం చుట్టు పక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల స్థలాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతలా అంటే చదరపు గజానికి అరలక్షకు పైగా పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రియల్ ఎస్టేట్ మొత్తం ఆ వైపునకు వెళ్లింది. చంద్రబాబు ఇన్ ఫ్రాపై పెద్దగా ఫోకస్ చేయడంతో రియల్ ఎస్టేట్ కు అక్కడే మంచి గిరాకీ ఏర్పడింది. మెల్లి మెల్లిగా తెలంగాణలో మళ్లీ ఊపందుకుంటుంది.

తొర్రూర్ భూములకు ఫుల్ క్రేజ్..

ఇటీవల హైదరాబాద్ నగర్ శివారులలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తొర్రూరు భూముల వేలం వామ్మో అనిపించింది. చదరపు గజానికి రూ. 67,500 పలికింది. ఇది ఇప్పటి వరకు రికార్డు ధరగా చెప్పవచ్చు. రాజీవ్ గృహకల్ప కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఒపెన్ ఫ్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలం కొనుగోలు దారుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. రియల్ ఎస్టేట్ కు చెందిన వందలాది మంది ఈ వేలంలో పాల్గొన్నారు. అబ్ధుల్లాపుర్ మెట్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వేలం జరిగింది. ఈ భారీ వేలంలో 300 చదరపు గజాల నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 100 ప్లాట్లను స్వాధీనం చేసుకున్నారు.

చదరపు గజానికి 67,500..

240 మంది రిజిస్టర్డ్ బిల్డర్లు హాజరయ్యారు. ఎక్కువ మంది తమ కుటుంబాలతో కలిసి వచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో రావడం చూసిన ప్రభుత్వం చదరపు గజానికి రూ. 25వేలు బేస్ కాస్ట్ నిర్ణయించింది. ఇందులో ప్రైమ్ కార్నర్ ప్లాట్లు చదరపు గజానికి రికార్డు ధరను సొతం చేసుకున్నారు. ఎంత అంటే ఏకంగా రూ. 67,500కు అవి అమ్ముడయ్యాయి. ఇక మధ్యలో ఉన్న ప్లాట్లు రూ. 33,000 వరకు అమ్ముడయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో రావడంతో వేలం సక్సెస్ అయ్యింది. ఈ వేలంతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు రూ. 105 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.

శివారు భూములకు భలే గిరాకీ

ఈ భారీ వేలానికి రాజీవ్ స్వగృహ, రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ బందోబస్తు మధ్య జరిగింది. భారీ వేలం, అధిక డిమాండ్, పోటీ వాతావరణం పరిశీలిస్తే రంగారెడ్డి భూములకు ఏ మేరకు విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణం పెరుగుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలకు అధిక ధరలు వెచ్చించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.