Begin typing your search above and press return to search.

ఫేక్ ఐడీతో లాయర్ అవతారం ఎత్తిన రౌడీషీటర్

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక రౌడీషీటర్ బరితెగింపు తెలిస్తే నోట్లో నుంచి మాట రాదంతే. అంతలా అతగాడి తీరు ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

By:  Garuda Media   |   19 April 2026 12:36 PM IST
ఫేక్ ఐడీతో లాయర్ అవతారం ఎత్తిన రౌడీషీటర్
X

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక రౌడీషీటర్ బరితెగింపు తెలిస్తే నోట్లో నుంచి మాట రాదంతే. అంతలా అతగాడి తీరు ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నేరస్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం మామూలే అయినా.. వరు తమ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా పోలీస్ స్టేషన్.. కోర్టులను వాడుకునే విషయంలోజంకుతారు.ఈ పాతబస్తీకి చెందిన రౌడీషీటర్ మహా ముదురు. తాజాగా ఇతగాడు ఫేక్ ఐడీతో లాయర్ గా అవతారం ఎత్తటమే కాదు..నాంపల్లి కోర్టులో కేసును వాదించేందుకు మెమో దాఖలు చేయటం కలకలాన్ని రేపింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 48 ఏళ్ల ఖాజా అనీసుద్దీన్ అలియాస్ సమీర్ అలీ అనే పాత నేరస్తుడిపై రౌడీషీట్ ఉంది.ఇతడిపై షాలిబండ పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు ఉన్నాయి. తాజాగా అతను రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీకి చెందిన సమీర్ అనే అడ్వకేట్ ఉన్నాడు. ఇతగాడి ఐడీ.. ఎన్ రోల్ మెంట్ నంబరును వాడి.. కేసులు వాదించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఇందులో భాగంగా ఫేక్ ఐడీ కార్డుతో పాటు.. లాయర్ సమీర్కు చెందిన అడ్వకేట్ ఎన్ రోల్ మెంట్ నెంబరును వాడేశాడు. ఇతగాడి తీరుపై సందేహంతో బార్ కౌన్సెల్ వారు అసలు సమీర్ కు సమాచారం అందించారు. దీంతో.. తన పేరు మీద మరెవరో కేసులు తీసుకోవటం.. వాదనలు వినిపిస్తున్నట్లుగా గుర్తించి షాక్ తిన్నాడు. తాజాగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి తరఫున బెయిల్ పిటిషన్ వేసి.. ఆ కేసు వాదనకు హాజరయ్యేందుకు నాంపల్లి క్రిమినల్ కోర్టులో మెమోను ఫైల్ చేసినట్లుగా గుర్తించారు

వెంటనే స్పందించి.. నాంపల్లి పోలీసులకు ఈ మోసం గురించి సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖాజా అనీసుద్దీన్ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఖాజా అనీసుద్దీన్ మీద రెండు రోజుల క్రితం చార్మినార్ పోలీసు స్టేషన్ లో మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. ఒక రౌడీషీటర్ ఫేక్ ఐడీతో లాయర్ గా అవతారం ఎత్తటం ఒక ఎత్తు అయితే.. మరో నేరస్తుడి బెయిల్ కోసం కోర్టులో మెమో దాఖలు చేయటం చూస్తే.. ఈ తరహా బరితెగింపు విషయంలో కోర్టులు.. పోలీసులు కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.