ప్రైవేట్ పార్టు కొరికేసి ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క
తాజా ఉదంతంలో ఒక పెంపుడు కుక్క తన యజమాని ప్రాణాలు తీసిన ఉదంతం షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 5 May 2025 5:36 PM ISTవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది కుక్క. వీధి కుక్కలతో పోలిస్తే పెంపుడు కుక్కలు మరింత విశ్వాసంగా.. యజమాని పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుంటాయి. యజమాని కోసం ప్రాణాలు ఇచ్చేందుకు వెనుకాడనట్లుగా ఉండే కుక్కల గురించి చాలానే విని ఉంటారు. అందుకు భిన్నంగా.. విన్నంతనే విస్తుపోయే ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
నిజానికి కుక్కల్ని పెంచుకునే యజమానులు వాటిని జంతువులుగా.. కాకుండా ఇంట్లో కుటుంబసభ్యులుగా ట్రీట్ చేస్తుంటారు. కొందరు సొంత బిడ్డల మాదిరి సాకుతుంటారు. తమతో పాటు తిండి పెట్టటంతో పాటు.. తమతో పాటు పడుకోబెట్టుకునే యజమానులు బోలెడంత మంది. తాజా ఉదంతంలో ఒక పెంపుడు కుక్క తన యజమాని ప్రాణాలు తీసిన ఉదంతం షాకింగ్ గా మారింది.
ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన పవన్ కుమార్ హైదరాబాద్ లో ఒక ప్రైవేటు జాబ్ చేస్తుంటాడు. తన స్నేహితుడు సందీప్ తో కలిసి ఐదేళ్లుగా మధురానగర్ లో నివసిస్తున్నాడు. శనివారం అనారోగ్యంతో బాధ పడుతున్న పవన్ ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అతని పక్కనే అతను పెంచుకునే కుక్క పడుకుంది. ఆదివారం ఉదయం ఎంతసేపు అయినా బెడ్రూం తలుపు తీయకపోవటంతో చుట్టుపక్కల వారిని పిలిచి.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు.
అప్పటికే పవన్ చనిపోయి ఉండటం.. అతడి ప్రైవేటు పార్టులను కొరికి తిన్న వైనం కనిపించింది. పెంపుడు కుక్క నోటి నిండా రక్తం కనిపించటంతో షాక్ తిన్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుక్కను అదుపులోకి తీసుకున్నారు.
