Begin typing your search above and press return to search.

48 గంట‌లే గ‌డువు.. ఎంఐఎం దూకుడు!

మ‌రో 48 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమ ల్లో ఉన్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 April 2025 2:24 PM IST
Hyderabad MLC Elections: Key Parties Support AIMIM
X

మ‌రో 48 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమ ల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ రోజు సాయంత్రంతో ఎన్నిక‌ల విందులు.. చ‌ర్చ‌ల‌కు కూడా ఫుల్ స్టాప్ ప‌డ‌నుంది. ఈ నెల 23న హైద‌రాబాద్ లోక‌ల్ బాడీ స్థాయిలోని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌ర‌గ నుంది. దీనిలో గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కార్పొరేట‌ర్లు పాల్గొని ఓటు హ‌క్కు వినియోగిం చుకుంటారు.

అదేవిధంగా ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా క‌లెక్ట‌ర్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు(హైద‌రాబాద్ ప‌రిధిలోని) త‌మ ఓట్ల ను వేయ‌నున్నారు. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ త‌ప్పుకొన్న విష‌యం తెలిసిందే. చిత్రంగా ఈ రెండు పార్టీలు.. తెర‌వెనుక ఎంఐఎంకు మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌న్న‌ది పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారం. బీఆర్ ఎస్ ఎలానూ.. ఎంఐఎంకు.. పాత‌మిత్రుడే కాబ‌ట్టి.. ఇబ్బంది లేదు. కానీ.. పైకి మాత్రం ఎవ‌రికీ ఓటేసేది లేద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక‌, కాంగ్రెస్ కూడా ఎంఐఎంకు మద్ద‌తు ఇస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం కాంగ్రెస్‌కు స‌హ‌క‌రించింది. దీంతో రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్‌కు ఇప్పుడు అవ‌కాశం వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. ఎంఐఎం గెలుపు ఖాయ‌మేన‌ని అనుకున్నా.. బీజేపీ కూడా అంతే స‌త్తాతో విజ‌యం కోసం ప్ర‌య‌త్ని స్తోంది. త‌మ‌కు స‌న్నిహితంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేట‌ర్లను బీజేపీ నాయ‌కులు బుజ్జ‌గిస్తున్నారు. ముఖ్యం గా కొంద‌రితో విందు రాజ‌కీయాలు కూడా చేస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నా యి.

ప్ర‌ధాన పోటీ దారుగా ఉ న్న ఎంఐఎం దారుస్సలాంలో భారీ ఎత్తున విందు ఏర్పాటు చేసింది. త‌న పార్టీ కార్పొరేట‌ర్ల‌కు.. ప్ర‌త్యేక ఆహ్వానాలు కూడా పంపింది. ఓటు ఎలా వేయాలి.. ఎలా వ్య‌వ‌హ‌రించాలి..అనే విష‌యాల‌పై వివ‌రించడంతోపాటు.. కార్పొరేట్ల‌ను సంతృప్తి ప‌రిచేందుకు అస‌దుద్దీన్ ఈ విందు ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నిక‌ల పోలింగ్‌కు 48 గంట‌ల ముందు.. ఎంఐఎం దూకుడు మ‌రింత పెర‌గ‌డం గ‌మ‌నార్హం.