Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో డ్ర*గ్స్ ఇంతనా..!

అవును... హైదరాబాద్ లో మరో భారీ డ్ర*గ్స్ రాకెట్ వ్యవహారం బహిర్గతమైంది. ఇందులో భాగంగా.. టీజీ ఏ.ఎన్.బీ అధికారులు ఓ రెస్టారెంట్‌ నిర్వాహకుడిని పట్టుకొని, విచారించగా ఈ తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   9 July 2025 10:54 AM IST
హైదరాబాద్ లో డ్ర*గ్స్ ఇంతనా..!
X

ఇటీవల కాలంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏ.ఎన్.బీ)కి విశ్వసనీయ సమాచారం అందడం.. అక్కడకు అధికారులు వెళ్లగానే డ్రగ్స్ దొరకడం సహజంగా మారిపోయిందనే కామెంట్లు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి! ఇప్పటికే పలు సందర్భమాల్లో పలు భారీ భారీ డ్ర*గ్స్ రాకెట్ లు బయటపడగా.. తాజాగా హైదరాబాద్ లో మరో భారీ డ్ర*గ్స్ రాకెట్ బహిర్గతమైంది.

అవును... హైదరాబాద్ లో మరో భారీ డ్ర*గ్స్ రాకెట్ వ్యవహారం బహిర్గతమైంది. ఇందులో భాగంగా.. టీజీ ఏ.ఎన్.బీ అధికారులు ఓ రెస్టారెంట్‌ నిర్వాహకుడిని పట్టుకొని, విచారించగా ఈ తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులు 25 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.

కొంపల్లి మాల్నాడు రెస్టారెంట్‌ నిర్వాహకుడు సూర్య వద్ద మాదకద్రవ్యాలున్నాయనే సమాచారంతో సైబరాబాద్‌ నార్కోటిక్స్‌ బృందం నిఘా ఉంచింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7:15 గంటల సమయంలో వాహనంలో వచ్చిన సూర్యను పట్టుకుంది! అనంతరం అతని కారు డ్యాష్‌ బోర్డును తనిఖీ చేయగా.. అక్కడ ఓజీ వీడ్, ఎక్‌ స్టసీ టాబ్లెట్స్ లభించాయి!

వ్యవహారం అక్కడితో అయిపోలేదు. కారు సీటు కింద దాచిన పార్సిల్‌ బాక్స్‌ లో మహిళల చెప్పులు లభ్యమయ్యాయి. అయితే అవి కేవలం పాదరక్షలు కాదు.. వాటి మడమలోని పాకెట్‌ లో కొకైన్‌ దొరికింది. ఈ స్థాయిలో హైదరాబాద్ లో డ్రగ్స్ హల్ చల్ చేస్తున్నాయి! దీంతో... అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో అతడు చెప్పిన విషయాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి!

ఇందులో భాగంగా... 2020లో హైదరాబాద్‌ లో మాల్నాడు రెస్టారెంట్‌ ను ప్రారంభించాడు సూర్య. దీంతో.. అక్కడికి తరచూ స్నేహితులు వచ్చేవారు. ఈ క్రమంలో ములుగులో తన బంధువు రాహుల్‌ కు చెందిన ఫామ్‌ హౌస్‌ కు తరచూ వెళ్లేవాడు! ఈ సమయంలో... బొల్లారంలో ఉండే నవదీప్‌ రెడ్డి, హిమాయత్‌ నగర్‌ కు చెందిన హర్షతో కలిసి అక్కడ డ్రగ్స్ సేవించేవాడు!

ఇదే సమయంలో... ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లోని ప్రిజమ్‌ పబ్, జూబ్లీహిల్స్‌ లోని ఫామ్‌ పబ్, మాదాపూర్‌ లోని బర్డ్‌ బాక్స్, హైటెక్‌ సిటీలోని బ్లాక్‌ 22లో, రాజాశ్రీకర్‌ కు చెందిన క్వేక్‌ అరేనా పబ్, పృథ్వీ వీరమాచినేనికి చెందిన ఎక్సోరా పబ్, రోహిత్‌ మాడిశెట్టికి చెందిన బ్రాడ్‌ వే పబ్‌ లోనూ స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవించేవాడు! వీటికోసం పబ్‌ లలో ప్రత్యేక ప్రాంతాలను కేటాయిస్తారని వెల్లడించాడని తెలుస్తోంది!

అదే విధంగా... గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కార్డియోవాస్క్యులర్‌ సర్జన్‌ గా పనిచేస్తున్న భీమవరంకు చెందిన డాక్టర్ తో కలిసి పలుమార్లు డ్ర*గ్స్ సేవించాడు. వీటికోసం 2021-22 మధ్య హర్ష నుంచి సుమారు 20 సార్లు కొకైన్ కొనుగోలు చేశాడు. ఇదే క్రమంలో ఖాజాగూడలో ఉండే స్నేహితుడు బెంగళూరులో ఉండే నైజీరియన్‌ జెర్రీ నుంచి డ్ర*గ్స్ కొని సూర్యకు సరఫరా చేసేవాడు!

ఇక గత ఏడాది మే నెలలో తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ కు వెళ్లిన సూర్యకు... ఢిల్లీలో ఉండే నైజీరియన్ పరిచయమవ్వడంతో.. అతడి నుంచి తరచూ కొకైన్, ఎక్ స్టసీ మాత్రలు కొని పలువురు స్నేహితులకు అమ్మేవాడు. ఈ క్రమంలో జూన్ లో ను మరికొన్ని డ్ర*గ్స్ కొన్నాడు.. ఈ నెల 4న కొకైన్ కోసం నైజీరియన్ అకౌంట్ కు రూ.80వేలు పంపించాడు. దానికి సంబంధించిన పార్సిల్ సోమవారం శ్రీమారుతీ కొరియర్ సంస్థ నుంచి అందింది!

ఈ సమయంలో... హైదరాబాద్ లో ఉంటున్న పలు ప్రాంతాలకు చెందినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే... హైదరాబాద్ లో డ్ర*గ్స్ ఈ స్థాయిలో తిరిగుతున్నాయా అనే చర్చ మరోసారి తెరపైకి వస్తున్నాయి!