గంజాయి చాక్లెట్లతో స్పెషల్ పాలు.. హైదరాబాద్ లో షాకింగ్ దందా
ఒక షాకింగ్ నిజం వెలుగు చూసింది. హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతంలో అమ్మే ప్రత్యేకమైన పాలకు భారీ డిమాండ్ ఉంటుంది.
By: Garuda Media | 18 Feb 2026 10:30 AM ISTఒక షాకింగ్ నిజం వెలుగు చూసింది. హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతంలో అమ్మే ప్రత్యేకమైన పాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా కాఫీ..టీలకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. హైదరాబాద్ లోని పక్కా వాణిజ్య ప్రాంతమైన బేగంబజార్ లోని తన స్టాల్ లో ప్రత్యేకమైన పాలను అమ్ముతుంటాడు. దీని రుచికి జనాలు ఫిదా అవుతుంటారు. తాజాగా.. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ శర్మను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకొని.. అరెస్టు చేశారు.
ఇతగాడు అమ్మే ఇస్పెషల్ పాలల్లో గంజాయి చాక్లెట్లను కలిపిన పాలు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఇదేదో ఆరోగ్యకమైన.. చిక్కటి పాలుగా భావించి పెద్ద ఎత్తున ఆ షాపులో పాలను కొంటుంటారు. అయితే.. అదంతా గంజాయి చాక్లెట్ల మాయ అన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. ఈ పాలతో యూత్ ను టార్గెట్ చేసుకొని.. మత్తు పదార్థాల్ని అమ్మే నెట్ వర్కును తయారు చేసుకున్నాడు.
వారికి గంజాయి చాక్లెట్లను.. ఇతర మత్తు పదార్థాల్ని అమ్ముతుంటాడన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇతడి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఏకంగా 1920 గంజాయి చాక్లెట్లను గుర్తించారు. ఈ చాక్లెట్లను హైదరాబాద్ మహా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎత్తున అమ్ముతున్నట్లుగా తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. గంజాయి నెట్ వర్కును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడికి గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తనకు వచ్చిన స్టాక్ ను వేర్వేరుగా ఎవరెవరికి అమ్ముతున్నారన్న విషయాన్ని తేల్చే ప్రయత్నంలో పోలీసులు తలమునకలై ఉన్నారు. అదే సమయంలో అనూహ్య రీతిలో నగర మున్సిపాలిటీలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఇలాంటి దందాలకు చెక్ పెట్టే చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది.
