Begin typing your search above and press return to search.

డ్రగ్స్ తో అరెస్టు అయిన డాక్టర్ కు డ్రగ్స్ అలవాటు వెనుక కథ ఇది!

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యజమాని కుమార్తె అయిన 34 ఏళ్ల డాక్టర్ నమ్రత డ్రగ్స్ కు బానిస కావటమే కాదు.

By:  Tupaki Desk   |   11 May 2025 10:25 AM IST
డ్రగ్స్ తో అరెస్టు అయిన డాక్టర్ కు డ్రగ్స్ అలవాటు వెనుక కథ ఇది!
X

ఓవైపు భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు.. ఇలాంటి వేళ.. ఈ రెండు అంశాలకు సంబంధించిన వార్తలు.. విశేషాలతో మీడియా..సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న వేళ.. శనివారం ఉదయం నుంచి ఒక యువ వైద్యురాలికి సంబంధించిన డ్రగ్స్ భాగోతం పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలోనూ..వాట్సప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున వైరల్ కావటం తెలిసిందే.

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యజమాని కుమార్తె అయిన 34 ఏళ్ల డాక్టర్ డ్రగ్స్ కు బానిస కావటమే కాదు.. ప్రతి నెలా ఇందుకోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేస్తారన్న షాకింగ్ నిజం వెలుగు చూసింది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉంటున్న ఆమెకు సంబంధించిన వివరాల్ని చూస్తే షాక్ కు గురి చేస్తాయి. హైదరాబాద్ లోని షేక్ పేటలో ఉన్న ఒక భారీ బహుళ అంతస్తుల భవన సముదాయంలో నివాసం ఉండే ఆమె.. 2017లో కేరళలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ నుంచి అంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. 2015లో ఒక డాక్టర్ తో ఆమెకు పెళ్లైంది. 2020లో వారు విడిపోయారు. వారి ఇద్దరి పిల్లల్ని ఆమే చూసుకుంటున్నారు.

తన కుటుంబానికి చెందిన ప్రముఖ ఆసుపత్రిలో ఏడాది పాటు పని చేసిన ఆమె.. 2021లో ఎంబీఏ చేసేందుకు స్పెయిన్ వెళ్లారు.అక్కడ వీకెండ్ లలో ఫ్రెండ్స్ ను కలిసినప్పుడు సరదాగా కొకైన్ తీసుకునే అలవాటు మొదలైంది. 2023 మార్చిలో భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటును మానుకోలేకపోతున్న పరిస్థితి. దీంతో.. ఫిలింనగర్ లోని ఒక కేఫ్ లో డీజేపీగా పని చేసే ఆమె ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సాయంతో కొకైన్ కొనటం మొదలు పెట్టారు.

అంతకంతకూ ఈ అలవాటు పెరిగి పెద్దది కావటంతో.. అప్పుడప్పుడు స్థానే రోజూ డ్రగ్స్ ను తీసుకోవటం స్టార్ట్ చేశారు. ఇటీవల ముంబయి నుంచి 50 గ్రాముల కొకైన్ వస్తున్నట్లుగా పక్కా సమాచారాన్ని అందుకున్న టీజీ న్యాబ్ పోలీసులు నిఘా పెట్టారు. షేక్ పేటలోని ఒక హోటల్ సమీపంలో కారులో ఉండి డ్రగ్స్ తీసుకుంటుగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు.

ఈ డాక్టరమ్మ ఫోన్ లో డ్రగ్స్ సరఫరాదారు వంశ్ తో చేసిన చాటింగ్ వివరాల్ని సేకరించారు. ఆమెకు సరుకు అందిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వంశ్ దగ్గర కమిషన్ తీసుకొని డ్రగ్స్ తీసుకొచ్చే అతడు.. ఆ పార్మిల్ ను క్షేమంగా చేర్చిన ప్రతిసారీ రూ.10వేలు డాక్టర్ తనకు ఇచ్చేవారని పోలీసులకు చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బస్సుల్లో తీసుకొచ్చేవాడినని అతను పేర్కొన్నాడు.