Begin typing your search above and press return to search.

విమానంలో గొడవపడ్డ జంట.. దెబ్బకు షాక్!

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ భార్యాభర్తలిద్దరూ హైదరాబాదు నుండి భోపాల్ కి వెళ్లడానికి రెండు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు.అలా ఇండిగో ఎయిర్ లైన్స్ 6e-7121 అనే విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2025 12:21 PM IST
విమానంలో గొడవపడ్డ జంట.. దెబ్బకు షాక్!
X

భార్య భర్తలు అన్నాక కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గొడవలు అప్పుడప్పుడు మితి మీరితేనే అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవలు వీధికెక్కితే.. ఆ భార్యాభర్తలకే కాదు చూసే వారికి కూడా అస్సలు బాగుండదు. అయితే తాజాగా ఓ దంపతులు చేసిన పనికి.. విమాన సిబ్బంది ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. ఇంట్లో గొడవ పడడం చాలదన్నట్లు.. విమానంలోనే గొడవ పెట్టుకున్న దంపతులకు విమాన సిబ్బంది ఆశ్చర్యపోయే షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ దంపతులు పెట్టుకున్న గొడవకి.. విమాన సిబ్బంది చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ భార్యాభర్తలిద్దరూ హైదరాబాదు నుండి భోపాల్ కి వెళ్లడానికి రెండు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు.అలా ఇండిగో ఎయిర్ లైన్స్ 6e-7121 అనే విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే విమానం స్టార్ట్ అయ్యే సమయానికి భార్యాభర్తలిద్దరూ బిగ్గరగా అరుస్తూ గొడవ స్టార్ట్ చేశారు. అయితే ఈ దంపతులు పెట్టుకున్న గొడవకి విమానంలో ఉన్న చాలామంది ఇబ్బంది పడ్డారు.. దాంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు చాలామంది వీరిద్దరి మధ్య జరిగే గొడవని సర్దుమనిగేలా మధ్యలో కల్పించుకున్నప్పటికీ...ఎవరి మాట వినకపోవడంతో విమాన సిబ్బంది విసిగిపోయింది. అయితే ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఈ దంపతులు గొడవ పెట్టుకోవడం ఆపకపోవడంతో చివరికి విమాన సిబ్బంది ఈ జంటకు గట్టి షాక్ ఇచ్చింది.

ఇక విషయంలోకి వెళ్తే..సాక్షి,వందిత్ లు భోపాల్ లో ఉంటారు. వీరిద్దరూ భోపాల్ నుండి హైదరాబాద్ కి పని మీద వచ్చారు. పని ముగించుకొని హైదరాబాద్ నుండి భోపాల్ కి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో విమానం ఎక్కిన తర్వాత ఒకరిపై ఒకరు చాలా బిగ్గరగా అరుచుకుంటూ గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ గొడవ అంతా చాలాసేపు గమనించిన విమాన సిబ్బంది చివరికి వీరి వల్ల విమానంలో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి, వెంటనే సాక్షి ,వందిత్ దంపతులను విమానం నుండి దింపేసింది. పైగా వాళ్ళని అక్కడే వదిలిపెట్టి విమానం వెళ్ళిపోయింది.

అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు దంపతుల గొడవకి విమాన సిబ్బంది ఇచ్చిన దెబ్బ అదుర్స్.. దంపతులకు షాక్ విమాన సిబ్బంది రాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరికొంత మందేమో దంపతుల మధ్య గొడవలు ఉండొచ్చేమో కానీ ఇలా నలుగురు నవ్వుకునేలా నలుగురు ఇబ్బంది పడేలా ఉంటే ఇలాగే జరుగుతుంది. భార్యాభర్తల గొడవలు ఇంట్లో ఉండే కుటుంబం బంధువులు భరిస్తారు. కానీ బయటికి వెళ్లి ఇతరులను కూడా ఇబ్బంది పెడతామంటే ఊరుకుంటారా.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.