వాయు కాలుష్య విశ్వరూపాన్నిచెప్పే తాజా రిపోర్టు
వాయుకాలుష్యం పెద్దల్ని మాత్రమే కాదు.. గర్భంలోని శిశువుల్ని కూడా విడిచిపెట్టటం లేదని.. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 12 April 2025 1:00 PM ISTవిస్మయానికి గురి చేసే రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. వాయు కాలుష్యం గురించి తరచూ వింటూ ఉంటాం. దీని తీవ్రత గురించి తెలిసింది తక్కువన్న విషయం తాజా రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చదివినప్పుడు అర్థమవుతుంది. వాయు కాలుష్యం ఎంత అపాయకరమన్న విషయంతో పాటు.. ఇది మనిషి ఆరోగ్యం మీద ఎంతటి దారుణ ప్రభావాన్ని చూపుతుందో వెల్లడైంది. చివరకు ఈ వాయు కాలుష్యం గర్భస్థ శిశువుల్ని విడిచి పెట్టటం లేదన్న విషయాన్ని హైదరాబాద్ కు చెందిన వైద్యురాలు కంచన్ తన పరిశోధనలో గుర్తించారు.
వాయుకాలుష్యం పెద్దల్ని మాత్రమే కాదు.. గర్భంలోని శిశువుల్ని కూడా విడిచిపెట్టటం లేదని.. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం వెలుగు చూసింది. వాయు కాలుష్యం కారణంగా నవజాత శిశువులు అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారని.. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొన్నారు. రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్ లో ఆస్థమాతో పుట్టే పిల్లల సంఖ్య ఏకంగా 20 శాతం పెరిగింది. తక్కువ బరువుతో పుడుతున్న పిల్లల సంఖ్య 15 శాతం పెరిగింది.
- కార్బన్ డయాక్సైడ్.. నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి హానికరమైన ఉద్గారాలు కలిసిన కలుషిత గాలిని గర్భిణులు పీల్చటం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టటం.. ఆస్థమా బారిన పడుతున్నారు.
- గర్భిణులు కాలుష్యం బారిన పడితే కడుపులో ఉండే శిశువు శ్వాసకోశ అవయవాల ఎదుగుదల సరిగా ఉండట్లేదు. ఆసుపత్రులకు వచ్చే పిల్లల్లో 50 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతున్నాయి.
- 30-40 శాతం పిల్లలకు అలర్జీ.. అస్థమా.. గురక.. అలర్జీ రినైటిస్ వంటి జబ్బులు ఉంటున్నాయి.
- చాలామంది పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు.
