Begin typing your search above and press return to search.

నిద్రపోవడానికి బయపడుతోన్న కొత్త పెళ్లికొడుకు.. షాకింగ్ రీజన్!

కొంతకాలం క్రితం భార్యల టార్చర్ తట్టుకోలేక వీడియోలు తీసుకుంటూ, నోట్స్ రాస్తూ ఆత్మహత్యలు చేసుకున్న భర్తల సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2025 10:29 AM IST
నిద్రపోవడానికి బయపడుతోన్న కొత్త పెళ్లికొడుకు..  షాకింగ్  రీజన్!
X

కొంతకాలం క్రితం భార్యల టార్చర్ తట్టుకోలేక వీడియోలు తీసుకుంటూ, నోట్స్ రాస్తూ ఆత్మహత్యలు చేసుకున్న భర్తల సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భార్యల చేతుల్లో హత్యకు గురవుతున్న భర్తల విషయాలు షాకింగ్ గా మారుతున్నాయి! ఈ క్రమంలో తాజాగా.. రాత్రులు కాసేపు నిద్రపోదామంటేనే భయమేస్తోందని అంటున్న ఓ కొత్త పెళ్లికొడుకు వ్యవహారం సంచలనంగా మారింది.

అవును... ఇటీవల మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు.. మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి ఘోరంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. తవ్వేకొద్దీ ఒక్కో షాకింగ్ విషయం ఆ ఉదంతంలో వెలుగుచూసింది! స్వయంగా భార్యే తన ప్రియుడి సపోర్ట్ తీసుకుని సుపారీ కిల్లర్లను పెట్టి భర్తను చంపించడం తీవ్ర కలకలం సృష్టించింది.

ఆ ఘటన గురించి మరిచిపోకముందే... తాజాగా తెలంగాణలోని గద్వాల జిల్లాలోనూ తేజేశ్వర్ అనే సర్వేయర్‌ ను అతడి భార్య ఇదే రీతిలో చంపించిన ఘటన తెరపైకి వచ్చింది. ఆ ఘటనలోనూ అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇల వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో... రఘువంశీ తరహాలోనే ప్రమాదంలో పడబోయి జస్ట్ మిస్ అయినట్లు చెబుతున్నారు మరో కొత పెళ్లికొడుకు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. ఆ వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపించిన ఆమె... మొదటి రాత్రి మాత్రం వింతగా.. కాదు కాదు.. భయంకరంగా ప్రవర్తించింది. ఇందులో భాగంగా.. ఏకంగా కత్తి తీసుకుని గదిలోకి వెళ్లింది. 'నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా' అంటూ మొదటిరాత్రి గదిలో భర్తను బెదిరించింది.

ఆ సందర్భంగానే తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది! అమన్ అనే వ్యక్తిని తాను ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె బెదిరించిందట. ఈ క్రమంలో మొదటి మూడు రోజులు తన ఇంట్లో ఉండి, ఒక రోజు అర్ధరాత్రి గోడ దూకి ప్రేమికుడితో సితార పారిపోయిందని నిషాద్ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సమయంలోనే ఓ షాకింగ్ విషయం వెల్లడించారు.

ఇందులో భాగంగా... సితార తనను కేదార్‌ నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, అయితే.. ఇటీవల జరిగిన రఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని నిషాద్ తెలిపాడు. ఒకవేళ వెళ్లి ఉంటే.. తన పరిస్థితి కూడా అలానే ముగిసి ఉండేదని అన్నాడు! తనతో సితార ఉండగా.. ఎక్కడ తనను చంపేస్తుందో అని సరిగా నిద్ర కూడా పోలేదని చెప్పుకుంటున్నాడు. అసలు పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతోందని అతను వ్యాఖ్యానించాడు.

దీంతో... గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న ఈ భయానక ఘటనలు చూసి కుర్రాళ్లు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వివాహ సమయంలో.. వరుడు, వధువు.. ఎవరికి ఏమాత్రం ఆ వివాహం ఇష్టం లేకపోయినా ఏమాత్రం భయపడకుండా తల్లితండ్రులకు చెప్పాలని, పేరెంట్స్ కూడా వారి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

అలా కాకుండా తల్లితండ్రులు పంతాలకు పట్టింపులకు కులాలు మతాల ఆలోచనలకు పొతే.. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో చూడాల్సి వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు!