Begin typing your search above and press return to search.

హ్యూమన్ ట్రాఫికింగ్... 303 మంది ఇండియన్స్ ఉన్న విమానం స్వాధీనం!

కాగా... రొమేనియా సంస్థ లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి నికరాగువాకు బయల్దేరింది

By:  Tupaki Desk   |   23 Dec 2023 7:37 AM GMT
హ్యూమన్ ట్రాఫికింగ్... 303 మంది ఇండియన్స్ ఉన్న విమానం స్వాధీనం!
X

హ్యూమన్ ట్రాఫికింగ్... ఊహించని పరిణామం తాజాగా తెరపైకి వచ్చింది. సుమారు 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్న సమాచారంతో స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అధికారులు ప్రయాణికుల్లోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు తాజా పరిస్థితిని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఇష్యూ వైరల్ గా మారింది.

అవును... హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులు ప్రయాణిస్తోన్న విమానాన్ని ఫ్రాన్స్‌ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న ఇష్యూకి సంబంధించి ఆ దేశ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... 303 మంది ప్రయాణికులు, సిబ్బంది ఐడెంటిటీని తనిఖీ చేస్తూ.. వారి ప్రయాణానికి గల కారణాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

ఈ ఘటనపై ఫ్రాన్స్‌ లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఇందులో భాగంగా... ఈ ఘటన గురించి ఫ్రాన్స్‌ అధికారులు వెల్లడించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారని చెప్పింది. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

కాగా... రొమేనియా సంస్థ లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఈ సమయంలో ఫ్యుయెల్ నింపడం కోసం ఫ్రాన్స్‌ లోని వాట్రీ ఎయిర్‌ పోర్టులో దిగింది. అయితే అప్పటికే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్‌ అధికారులు ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఆ ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నారని.. వారంతా అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా వారంతా నికరాగువాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.