Begin typing your search above and press return to search.

మన బాడీలో రోజూ ఇంత రక్తం తయారవుతుందా? పాతది ఏమవుతుందో తెలిస్తే షాక్!

అయితే మీక్కూడా ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. అసలు రోజూ కొత్త రక్తం ఎక్కడ తయారవుతుంది? మరి పాత రక్తం ఏమైపోతుంది? అయితే దీని సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   10 April 2025 12:00 AM IST
Newly Formed Blood Cells
X

మనిషి శరీరానికి రక్తం చాలా ముఖ్యం. రక్తం లేకపోతే మనిషి బతకలేడు. డాక్టర్లు కూడా తరచూ చెప్తుంటారు కదా.. ఒంట్లో రోజూ కొత్త రక్తం తయారవుతుందని, అందుకే రక్తదానం చేయాలని. రోజూ కొత్త రక్తం తయారవుతున్నా కొంతమంది మాత్రం రక్తదానం చేయడానికి వెనకాడతారు. అయితే మీక్కూడా ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. అసలు రోజూ కొత్త రక్తం ఎక్కడ తయారవుతుంది? మరి పాత రక్తం ఏమైపోతుంది? అయితే దీని సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

ముందుగా రక్తం శరీరంలో ఎక్కడ తయారవుతుందో తెలుసుకుందాం. కొత్త రక్తం ఎముకల మధ్య ఉండే స్పంజ్ లాంటి బోన్ మారోలో తయారవుతుంది. ఇందులో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. బోన్ మారో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లను తయారు చేస్తుంది. ఈ కణాల ద్వారానే మళ్లీ శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది.

రక్తం ద్వారానే శరీరంలోని ప్రతి అవయవం బతికుంటుంది. మన రక్తంలో 60శాతం ప్లాస్మా ఉంటుంది. ఇది పసుపు రంగులో ఉండే ద్రవం. శరీరంలో పాత రక్తం రెండు విధాలుగా నశిస్తుంది. ఒకటి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. రెండోది పాత రక్తం శరీరంలోని వేర్వేరు భాగాలకు బదిలీ అవుతుంది. అక్కడ కొత్త రక్తం తయారవుతుంది. రక్త ప్రవాహం రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా గుండె, ధమనులు, సిరల ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారానే శరీరంలోని పాత రక్తం నశిస్తుంది. కొత్త రక్తం తయారవుతుంది. అందుకే ఎవరైనా తమ శరీరం నుండి కొంత రక్తాన్ని దానం చేస్తే, కొత్త రక్తం తయారవడానికి ఎక్కువ సమయం పట్టదు. 3-4 రోజుల్లో దాని రికవరీ అయిపోతుంది.