Begin typing your search above and press return to search.

బెంగుళూరులో 1500 కట్టి చెట్టును హగ్ చేసుకోవాలి!

చెట్టును మీరు కౌగిలించుకోవాలి అంటే రూ.1500 ఫీజు చెల్లించాలి.

By:  Tupaki Desk   |   22 April 2024 1:30 PM GMT
బెంగుళూరులో 1500 కట్టి  చెట్టును హగ్ చేసుకోవాలి!
X

మీరు చదివింది నిజమే. మీరు చెట్టును కౌగిలించుకుంటే మీకు ఉన్న మానసిక వత్తిడి మాయమైపోతుంది. అలాగని అది ఊరికే కాదండోయ్. కాస్తంత ఖరీదైన వ్యవహారమే. చెట్టును మీరు కౌగిలించుకోవాలి అంటే రూ.1500 ఫీజు చెల్లించాలి.

బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రోవ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ అనే కంపెనీ ఏప్రిల్‌ 28న ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, ఇందులో చెట్లను కౌగిలించుకోవడం, అడవిలో నడవడం వంటివి ఉంటాయని, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆ ప్రకటనలో తెలిపింది.

బెంగళూరు హైకోర్టు పక్కన ఉన్న కబ్బన్‌ పార్క్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారు ఒక్కొక్కరు రూ.1,500 చెల్లించాలని తెలిపింది. కంపెనీ ప్రకటన చూసిన నెటిజన్లు చెట్టును కౌగిలించుకోవడానికి రూ.1500 ఏంటి అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.