Begin typing your search above and press return to search.

భారీ తుఫాన్ వ‌స్తోంది.. మీ జాగ్ర‌త్త‌లు త‌ర్వాత‌.. మా తాత‌ల విగ్ర‌హాలు.. వాల్ పోస్ట‌ర్లు జాగ్ర‌త్త‌!!

భారీ తుఫాన్ వ‌స్తోంది.. మీ జాగ్ర‌త్త‌లు త‌ర్వాత‌.. మా తాత‌ల విగ్ర‌హాలు.. వాల్ పోస్ట‌ర్లు జాగ్ర‌త్త‌!!" అంటూ.. ఉత్త‌ర కొరియా పాల‌కుడు కిమ్ జోంగ్ ఉన్ ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 2:30 AM GMT
భారీ తుఫాన్ వ‌స్తోంది.. మీ జాగ్ర‌త్త‌లు త‌ర్వాత‌.. మా తాత‌ల విగ్ర‌హాలు.. వాల్ పోస్ట‌ర్లు జాగ్ర‌త్త‌!!
X

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. "భారీ తుఫాన్ వ‌స్తోంది.. మీ జాగ్ర‌త్త‌లు త‌ర్వాత‌.. మా తాత‌ల విగ్ర‌హాలు.. వాల్ పోస్ట‌ర్లు జాగ్ర‌త్త‌!!" అంటూ.. ఉత్త‌ర కొరియా పాల‌కుడు కిమ్ జోంగ్ ఉన్ ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. ఏక వాక్య హెచ్చ‌రిక‌తో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను భ‌య కంపితుల‌ను చేశారనే చెప్పాలి. నిజానికి ఏ దేశంలో అయినా.. ప్ర‌జ‌లు ముందు. విప‌త్క‌ర ప‌రిస్థితులు అంటే.. తుఫాన్లు, వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు, భూకంపాలు వ‌చ్చిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు కూడా ప‌నిచేస్తారు.

కానీ, అది ఉత్త‌ర కొరియా. అంతా పాల‌కుల కోస‌మే ప‌నిచేయాలి. పాల‌కులు తిన్నాకే.. ప్ర‌జ‌లు తినాలి. ఇటీవ‌ల క‌రువు వ‌చ్చి.. తీవ్ర దుర్భిక్షం ఏర్ప‌డి తిండి గింజ‌ల‌కు ప్ర‌జ‌లు మ‌లిగిపోతే.. అప్పుడు కూడా ఉన్ ఇలానే ఆదేశాలు జారీ చేశారు. "ఒక్క‌రు తినేది న‌లుగురు తినండి.. మూడు పూట‌లు తినేది ఒక్క పూట‌తో స‌రిపెట్టుకోండి. పొరుగు వారి నుంచి ఒక్క గింజ కూడా తీసుకోవ‌ద్దు" అని హెచ్చ‌రించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మ‌ర‌ణాల సంఖ్య రెండు నెల్ల‌లోనే నాలుగు రెట్లు పెరిగిన‌ట్టు అంత‌ర్జాతీయ మీడియా చెప్పింది.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం జపాన్‌ను కుదిపేసిన తుఫాను 'ఖానున్‌' కొరియా ద్వీపకల్పానికి చేరింది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కొరియా అల్ల‌క‌ల్లోలం అయింది. ఈ క్రమంలోనే 'ఖానున్‌'.. ఉత్తర కొరియాలోకి ప్రవేశించనుంది. వాస్తవానికి మౌలిక సదుపాయాల లేమితో ఉన్న ఉత్తర కొరియా.. ప్రకృతి విపత్తులతో తీవ్ర నష్టాలను చవిచూస్తుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఉత్త‌ర కొరియా చ‌ర్య‌లు చేప‌ట్టాలి. చేప‌డుతుంద‌ని అంద‌రూ అనుకుంటారు.

కానీ, అక్క‌డ ఉన్న‌ది కిమ్‌. దీంతో ఆయ‌న 'ప్ర‌స్తుతం తుఫాను హెచ్చ‌రిక‌లు పెరిగాయి. ఉత్తర కొరియన్ల ప్రధాన దృష్టి.. మన‌ దేశ నాయకుల(కిమ్ తాత‌లు, తండ్రి) వాల్ పోస్ట‌ర్లు, విగ్రహాలు, కుడ్యచిత్రాలు, ఇతర స్మారక చిహ్నాల భద్రతపై ఉండాలి. తుఫాను కార‌ణంగా.. అవి భంగ ప‌డ‌రాదు' అని అధికార పత్రిక వేదికగా కిమ్‌ ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. అంటే.. ప్ర‌జ‌లు ఏమైనా ఫ‌ర్వాలేద‌న్న మాట‌. ఇదీ.. సంగ‌తి!!