Begin typing your search above and press return to search.

ఏపీలో ఈసారి భారీ పోలింగ్...!?

ఏపీలో ఈసారి పోలింగ్ ఎలా జరుగుతుంది. భారీగా నంబర్ నమోదు అవుతుందా అంటే రాజకీయాల శైలి చూస్తూంటే అది అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 3:38 AM GMT
ఏపీలో ఈసారి భారీ పోలింగ్...!?
X

ఏపీలో ఈసారి పోలింగ్ ఎలా జరుగుతుంది. భారీగా నంబర్ నమోదు అవుతుందా అంటే రాజకీయాల శైలి చూస్తూంటే అది అనిపిస్తుంది. ఎపుడైనా ఎక్కడైనా పోటాపోటీ వాతావరణం ఉంటే కచ్చితంగా పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతుంది. ఇది చరిత్ర చెబుతున్న మాట. అలాగే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత హెచ్చుగా ఉన్నా లేక ఒక ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ అభిమానం ఎక్కువగా ఉన్నా కూడా పోలింగ్ రికార్డులు తిరగరాస్తుంది.


దానికి తోడు ఎన్నికల సంఘం అధికారులు ప్రజలలో చైతన్యం కలిగించడం స్వచ్చంద సంస్థలు అలాగే ఇతర నోడల్ ఏజెన్సీలు కూడా ఓటింగ్ గురించి దాని ప్రాధాన్యత గురించి ప్రజలను చైతన్య పరచిన తీరుని బట్టి కూడా ఓటింగ్ పెద్ద ఎత్తున నమోదు అవుతుంది. గడచిన రెండు మూడు ఎన్నికల బట్టి చూస్తే దేశంలో కానీ పలు కీలక రాష్ట్రాలలో కానీ సగటు పోలింగ్ శాతం డెబ్బై కి మించి ఉంది. ఇదే రెండు దశాబ్దాల క్రితం చూస్తే కనుక అరవై శాతం లోపే ఉంటూ వచ్చేది.

ప్రజలలో అంతకంతకు పెరుగుతున్న రాజకీయ చైతన్యం పార్టీలు తీసుకుంటున్న శ్రద్ధ అత్యాధునిక సాంకేతక అందుబాటులోకి రావడంతో దానిని వాడుకుంటూ పాలిటిక్స్ మీద ఆసక్తిని పెంచడం వంటివి కూడా ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సకల చర్యలను తీసుకుంటోంది.

ఈసారి ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు కావాలన్నది లక్ష్యంగా చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక అప్పట్లో జాతీయ స్థాయిలో చూసుకుంటే కనుక 69 శాతం పోలింగ్ నమోదు అయింది.

మరి పాత వివరాలనే తీసుకుంటే 2019లో పోలింగ్ శాతమే ఎక్కువ అని అనుకుంటే దాన్ని మించి ఈసారి జరుగుతుంది అని ఎన్నికల సంఘం అధికారులు కూడా అంటున్నారు. ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ గట్టిగానే ఉంది. అలాగే విపక్ష తెలుగుదేశం ఓటు బ్యాంక్ కూడా పటిష్టంగా ఉంది. జనసేనకు కూడా కొత్తగా మంచి ఓటు షేర్ దక్కే చాన్స్ ఉంది అంటున్నారు.

ఇలా పోటాపోటీగా పార్టీలు అన్నీ కలసి తన అభిమానులను సానుభూతిపరులను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని రావడం ఖాయం. ప్రతీ ఓటూ ఈసారి కీలకం అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. దాంతో ఎవరికి వారు కష్టపడతారు అన్నది తెలుస్తోంది. దాంతో పాటుగా గతం కంటే ఈసారి విద్యావంతులు చదువరులు కూడా ఓట్లు వేయడానికి క్యూ కడతారు అని అంటున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో అది రుజువు అయింది అని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈసారి 80 శాతానికి పైగా పోలింగ్ జరిగితే మాత్రం అది సంచలన ప్రజా తీర్పునకు దారి తీస్తుందని అంటున్నారు.