Begin typing your search above and press return to search.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ అర్హతలుండాలి?

దేశంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   8 May 2024 4:30 PM GMT
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ అర్హతలుండాలి?
X

దేశంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి లెక్కకు మిక్కిలే ఉన్నాయి. డెవలప్ మెంట్ దేశాల్లో ఓ నాలుగు లేదా ఐదు పార్టీలే ఉంటాయి. కానీ మన దేశంలో ఏదైనా ఎక్కువే. సెల్ ఫోన్ టవర్లు తీసుకున్నా లెక్కకు మిక్కిలే ఉండటం గమనార్హం.

జాతీయ పార్టీలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అనే ధోరణిలో రెండు పార్టీలు కదనరంగంలో పోరాడుతున్నాయి.

ఇక ప్రాంతీయ పార్టీలైతే ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, లోక్ సత్తా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్. ఒడిశాలో నవీన్ పట్నాయక్ దే బలం ఉంటుంది. ఇలా ప్రాంతీయ పార్టీలదే పెత్తనం. మన దేశంలో పార్టీల ఏర్పాటు చాలా సులభం. కానీ వాటిని నడిపించడమే కష్టం. అలా మన దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రధానంగా కనిపిస్తుంది.

దేశంలో ప్రాంతీయ పార్టీల రాజకీయం నియంతలా ఉంటుంది. వారు చెప్పిందే వేదం. వారు గీసే గీతను దాటే ప్రయత్నం చేయరు. భయపడుతుంటారు. కానీ జాతీయ పార్టీల్లో అలా కాదు. ఎవరి పెత్తనం వారిదే. ఎవరి నోటికి అదుపు ఉండదు. అందరు లీడర్లే. అందరు శాసించే వారే. వాటిని అమలు చేసే వారే తక్కువ. ఇలా ప్రాంతీయ పార్టీలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.

ప్రాంతీయ పార్టీల్లో అధినేతదే తుది నిర్ణయం. తమ నేత చెప్పారంటే దాన్ని అందరు పాటించాల్సిందే. అది తప్పు అయినా రైటయినా ప్రశ్నించే సత్తా ఉండదు. ఒకవేళ ప్రశ్నిస్తే అతడికి ఏ పదవి దక్కదు. అంతటి నియంత పాలన ప్రాంతీయ పార్టీల సొంతం. అందుకే ప్రాంతీయ పార్టీలే పది కాలాల పాటు అధికారం చెలాయిస్తుండటం చూస్తుంటాం.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే పార్టీకి కొన్ని అర్హతలు ఉండాలి. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీలో నిలవాలి. పోలైన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. ఎంపీలుగా కనీసం నలుగురు ఎన్నికవ్వాలి లేదా నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. లేదా లోక్ సభ న్నికల్లో మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల్లో అభ్యర్థులు గెలిచి ఉండాలి. ఇలాంటి అర్హతలుంటేనే జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది.