Begin typing your search above and press return to search.

తొలి దశ : అత్యధికం రూ.716 కోట్లు .. కనిష్టం రూ.320

తొలిదశలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత సంపన్న అభ్యర్థి ఆస్తుల విలువ రూ.716 కోట్లు కాగా, అత్యంత తక్కువగా కేవలం రూ.320 మాత్రమే ఉన్న వ్యక్తి మరొకరు కావడం విశేషం.

By:  Tupaki Desk   |   19 April 2024 10:56 AM GMT
తొలి దశ : అత్యధికం రూ.716 కోట్లు .. కనిష్టం రూ.320
X

దేశవ్యాప్తంగా ఈ రోజు 102 లోక్ సభ స్థానాలలో తొలి దశ పోలింగ్ కొనసాగుతున్నది. మొత్తం 16.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా 1625 మంది అభ్యర్థులు ఈ స్థానాలలో పోటీ చేస్తున్నారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 102 లోక్ సభ స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి.

తొలిదశలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత సంపన్న అభ్యర్థి ఆస్తుల విలువ రూ.716 కోట్లు కాగా, అత్యంత తక్కువగా కేవలం రూ.320 మాత్రమే ఉన్న వ్యక్తి మరొకరు కావడం విశేషం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 1625 మంది అభ్యర్థులలో 450 మంది కోటీశ్వరులు ఉండడం విశేషం కాగా, 10 మంది తమ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు.

మధ్యప్రదేశ్ లోని చింద్వారా సిట్టింగ్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఆస్తులు రూ.716 కోట్లతో సంపన్న అభ్యర్థిగా నిలవగా, తమిళనాడు ఈ రోడ్ నుండి పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే అభ్యర్థి అశోఖ్ కుమార్ రూ.662 కోట్లతో ద్వితీయ స్థానంలో, అదే రాష్ట్రంలో శివగంగ నుండి పోటీ చేస్తున్నబీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ.304 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి షా రూ.206 కోట్లతో నాలుగు, ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మాజిద్ అలీ రూ.159 కోట్లతో 5వ స్థానంలో నిలిచారు. అయితే తమిళనాడులోని తూత్తుకుడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పొన్‌రాజ్ కె తన ఆస్తి విలువ కేవలం రూ.320 అని వెల్లడించడం విశేషం.