Begin typing your search above and press return to search.

స్టేషన్ ముందు గంజాయి తాగుతూ రీల్.. కట్ చేస్తే..?

ఈ రీల్ ను చూసిన నెటిజన్లు కొందరు స్పందించి.. ఈ పోస్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేవారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం పోలీసులకు ఈ సమాచారాన్ని అందించింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:05 AM GMT
స్టేషన్ ముందు గంజాయి తాగుతూ రీల్.. కట్ చేస్తే..?
X

చర్యకు ప్రతిచర్య అన్న మాట ఊరికే అనలేదు. తప్పుడు పనులు చేసే వారికి దిమ్మ తిరిగే షాకులు ఇచ్చే విషయంలో హైదరాబాద్ పోలీసులు ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంతోనే.. సైబర్ నేరాతోపాటు.. దేశంలో ఎన్నో రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పినా.. హైదరాబాద్ పోలీసుల ముందు మాత్రం పప్పులు ఉడకని పరిస్థితి. ఇప్పటికే ఈ వ్యవహారం ఎన్నోసార్లు నిరూపితమైంది.

ఇదంతా ఎందుకుంటే తాజాగా హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక యువకుడు ఓవరాక్షన్ చేశాడు. పోలీసు స్టేషన్ ఎదుట గంజాయి తాగుతూ రీల్ చేయటమే కాదు.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కట్ చేస్తే.. అతగాడిని తాజాగా జైలుకు పంపిన వైనం ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఎదుట వంశీ క్రిష్ణ అనే యువకుడు స్టేషన్ ఎదుట గంజాయి తాగుతూ ఒక ర్యాప్ సాంగ్ కు రీల్ చేశాడు. దీన్ని ఇన్ స్టాలో పోస్టు చేశాడు. తన ఓవరాక్షన్ ను ప్రదర్శించాడు.

ఈ రీల్ ను చూసిన నెటిజన్లు కొందరు స్పందించి.. ఈ పోస్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేవారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం పోలీసులకు ఈ సమాచారాన్ని అందించింది. వాయు వేగంతో రియాక్టు అయిన పోలీసులు.. వంశీ క్రిష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కోర్టు ఎదుట హాజరుపర్చగా చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు పంపారు.

ఈ సందర్భంగా అతడ్ని జైలుకు పంపే క్రమంలో రీల్ వర్సెస్ జైలు పేరుతో ఒక వీడియోను సిద్ధం చేసిన పోలీసులు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటం ద్వారా.. ఓవరాక్షన్ చేసే వారికి తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. మత్తుపదార్థాలపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు సీరియస్ గా ఉండటమే కాదు.. ఇలాంటి వారు ఏ స్థాయిలో ఉన్నా వారిని ఉత్తనే వదిలిపెట్టొద్దని సీరియస్ ఆదేశాలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం డ్రగ్స్ విషయంలో యమా సీరియస్ గా ఉండటం తెలిసిందే. ఇలాంటివేళ.. రీల్ తో ఓవరాక్షన్ చేసిన వంశీక్రిష్ణకు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు పోలీసులు. సో.. రీల్ చేసే వేళ జర జాగ్రత్త అని మాత్రం చెప్పక తప్పదు.