Begin typing your search above and press return to search.

గంట పాటు ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా

ఇటీవల ఫైబర్ మీడియా రీసెర్చ్ వెలువరించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

By:  Tupaki Desk   |   14 Dec 2023 5:30 PM GMT
గంట పాటు ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా
X

మానవ సంబంధాలు ప్రస్తుతం దెబ్బతింటున్నాయి. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరకడం లేదు. ఈనేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. ఫోన్ల వాడకం వల్ల మనుషుల్లో మానవతా విలువలు కూడా నశిస్తున్నాయి. ఇటీవల ఫైబర్ మీడియా రీసెర్చ్ వెలువరించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ల వాడకంతో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి.

వివో కంపెనీ ఫోన్ల వినియోగం గురించి కొన్ని సూచనలు చేసింది. ఫోన్ల వాడకం రోజు పెరగడం వల్ల వాటి వల్ల కలిగే నష్టాల గురించి తనదైన శైలిలో స్పందించింది. #switch off క్యాంపెయిన్ పేరిట ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రోజుకో గంట పాటు స్విచ్చాఫ్ చేయడం వల్ల మనుషుల మధ్య మాటలు మాట్లాడుకునే వీలు చిక్కుతుందని తెలిపింది.

డిసెంబర్ 20న వినియోగదారులు రాత్రి 8 నుంచి 9 వరకు గంట పాటు మొబైళ్లు స్విచ్చాఫ్ చేయాలని పేర్కొంది. ఆ గంట సమయంలో కుటుంబంతో గడపొచ్చు. మనుషుల్లో సంబంధాల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు అందరు విధిగా దీన్ని పాటించి సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనుషుల్లో దూరం పెరిగిపోయింది. అందుకే ఇలాంటి చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతున్నారు. దీని కోసమే అందరిలో పరివర్తన కలగాలని చూస్తున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఎవరు గుర్తించడం లేదు. రోజురోజుకు దానికి బానిసలుగా మారుతున్నారు.

కస్టమర్ల సంక్షేమం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొబైళ్లు గంట సేపు స్విచ్చాఫ్ చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత కూడా పెరుగుతుంది. గంట సమయం ఫ్యామిలీతో గడిపి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు. దీనికి గాను స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంబంధాలు మెరుగుపరచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.