Begin typing your search above and press return to search.

2016 నుంచి ఇప్పటివరకు దావూద్ ను ఎన్నిసార్లు చంపేశారో!

మొత్తంగా చూస్తే.. పాక్ కు చెందిన ఒక యూట్యూబర్ పుణ్యమా అని ఈ హడావుడి చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 6:00 AM GMT
2016 నుంచి ఇప్పటివరకు దావూద్ ను ఎన్నిసార్లు చంపేశారో!
X

అత్యుత్సాహంతో ప్రముఖుల్ని.. సెలబ్రిటీలను అదే పనిగా చంపేయటం మీడియాకు అలవాటు. దానికి నాలుగు ఆకులు ఎక్కువ చదివిన సోషల్ మీడియా పుణ్యమా అని.. బతికి ఉండగానే చంపేస్తున్నారు. అయితే.. సంచలనాల వేలటో మీడియా లేనప్పుడు.. సోషల్ మీడియా హడావుడి పెద్దగా లేని వేళలోనూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను చంపేసిన ఉదంతాలు బోలెడన్ని ఉన్నాయి. తాజాగా ఆయన మీద విష ప్రయోగం జరిగిందని.. కరాచీలోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లుగా వార్తలు రావటం.. అంతలోనే ఆయన చనిపోయారంటూ మరో ప్రచారం పెద్ద ఎత్తున సాగటం తెలిసిందే.

మొత్తంగా చూస్తే.. పాక్ కు చెందిన ఒక యూట్యూబర్ పుణ్యమా అని ఈ హడావుడి చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అధికారిక వర్గాలేవీ కూడా దావూద్ ఏ ఆసుపత్రిలోనూ చేరలేదని స్పష్టం చేస్తున్నపరిస్థితి. ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేస్తున్న పలువురు.. దావూద్ ను గతంలో పలుమార్లు చనిపోయినట్లుగా ప్రచారం జరగటానని గుర్తు చేస్తున్నారు. రక్తంలో ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నాడని.. దాంతో ఆయన కాలు తీసేసినట్లుగా 2016లో వార్తలు వచ్చాయి. అయితే.. అదంతా ఉత్తమాట అని తేలింది.

ఆ తర్వాత 2017లో చనిపోయినట్లుగా ప్రచారం జరిగింది. ఆ సందర్భంగా గుండెపోటు కానీ.. బ్రెయిన్ ట్యూమర్ అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే.. దానికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ లేదు. మరి.. దావూద్ ఎక్కడ? అన్న ప్రశ్నకు ఇటీవల ఒక ఆధారం చిక్కింది. అతని సోదరి పార్కర్ కుమారుడు అలీషా జాతీయ దర్యాప్తు సంస్థకు చెబుతూ.. దావూద్ కరాచీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. దీనిపై పాక్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. ఇలా దావూద్ పలుమార్లు చనిపోయినట్లుగా వార్తలు వచ్చినా.. నిజంగా చనిపోయింది మాత్రం లేదని చెబుతున్నారు. దావూద్ సన్నిహితులు మాత్రం అతగాడు నిక్షేపంగా ఉన్నాడని.. అతనికేం కాలేదని స్పష్టం చేస్తున్నారు.