Begin typing your search above and press return to search.

రూ.2వేల నోట్లు ఇప్పటికి వరకు ఆర్ బీఐకు చేరిందెంత?

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:49 AM GMT
రూ.2వేల నోట్లు ఇప్పటికి వరకు ఆర్ బీఐకు చేరిందెంత?
X

మొన్నటి వరకు చెలామణీలో ఉన్న అతి పెద్ద నోటు రూ.2వేలను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటూ మార్గదర్శకాలు జారీ కావటం తెలిసిందే. ఈ ప్రక్రియకు సంబంధించిన గడువు సెప్టెంబరు 31గా నిర్ణయించటం తెలిసిందే. రూ.2వేల నోటును ఆర్ బీఐ ఉపసంహరించుకుంటూ చేసిన ప్రకటన నాటి నుంచి జులై 31 వరకు ఎన్ని నోట్లు బ్యాంకుల ద్వారా ఆర్ బీఐకు వెనక్కి వచ్చాయి? అన్నదానిపై సమాచారం లేదు.

తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది మే 19న రెండు వేల నోటును ఉపసంహరించుకుంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రజలు తమ వద్ద ఉన్న ఈ పెద్ద నోటును బ్యాంకుల్లో కానీ.. ఇతర వాణిజ్య సంస్థల్లో కానీ డిపాజిట్ చేయొచ్చని చెప్పటం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. జులై 31నాటికి ఆర్ బీఐకు మొత్తం నోట్లల్లో సుమారు 88 శాతం వెనక్కి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.

వెనక్కి వచ్చేసిన పెద్ద నోట్ల విలువ దగ్గర దగ్గర రూ.3.14 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మరో రూ.0.42 లక్షల కోట్ల మేర రూ.2వేల నోట్ల రావాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. రూ.2వేల నోట్లను వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు దాదాపు రెండు నెలల గడువు ఉన్న నేపథ్యంలో.. అప్పటికి బ్యాంకులకు వచ్చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. గడువు ఎక్కువగా ఉండటం.. పరిమితులు తక్కువగా ఉండటంతో రూ.2వేల నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయంలో ప్రజలు పెద్దగా ఇబ్బందులకు గురి కాలేదు.