Begin typing your search above and press return to search.

హర్మూజ్ జలసంధి వద్ద వెయిట్ చేస్తున్న నౌకలెన్ని?

భారతదేశానికి రావాల్సిన నౌకలకు సంబంధించిన వివరాల్ని తాజాగా కేంద్రం సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   31 March 2026 12:15 PM IST
హర్మూజ్ జలసంధి వద్ద వెయిట్ చేస్తున్న నౌకలెన్ని?
X

భారతదేశానికి రావాల్సిన నౌకలకు సంబంధించిన వివరాల్ని తాజాగా కేంద్రం సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. చూస్తుండగానే ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్నయుద్ధం మొదలై నెల దాటింది. మూడు వారాల్లో యుద్ధాన్ని ముగించేస్తామని అగ్రరాజ్యం అమెరికా గొప్పలు చెప్పినా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వివిధ దేశాల మధ్య యుద్ధం జరిగినా.. ప్రపంచ దేశాలు ప్రభావితమైంది అంతంతే. ఎప్పుడైతే ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైందో అప్పుడు కానీ ప్రపంచానికి అసలు నొప్పి తెలియలేదు. చూస్తుండగానే యుద్ధం మొదలై నెల రోజులు పూర్తైన నేపథ్యంలో.. పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి.

ఇదిలా ఉంటే.. హర్మూజ్ జలసంధి వద్ద భారత్ కు చెందిన (భారత జాతీయ పతాకం, విదేశీ జాతీయ పతాకం ఉన్నప్పటికి భారత్ కు రావాల్సిన చమురు, ఎరువు నౌకలు) మొత్తం నౌకలు 22 వరకు ఉన్నట్లుగా కేంద్రం సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్న మొత్తం నౌకల్లో పందొమ్మిది నౌకలు ముడి చమురుకు సంబందించిన నౌకలు కావటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కు రావాల్సిన నౌకల లెక్క సరే.. మరి ప్రపంచ దేశాలకు చెందిన ఎన్ని నౌకలు అక్కడ నిలిచిపోయాయి? అందులో అత్యధికం ఏ వస్తువుల్ని తీసుకొస్తున్నాయన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్న నౌకలు అక్షరాల 2 వేల నుంచి 3 వేల మధ్యన ఉంటాయని చెబుతున్నారు.ఈ అంకె విన్నంతనే అవాక్కు కావటం ఖాయం. కానీ.. ఈ గణాంకాలన్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. హర్మూజ్ జలసంధింకి ఇరువైపులా అంటే.. పర్షియన్ గల్ఫ్.. గల్ఫ్ ఆఫ్ ఓమన్ వద్ద భారీ స్థాయిలో నౌకలు నిలిచిపోయిన పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక్కడ నిలిచిపోయిన నౌకల్లో అత్యధికం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందినవే అన్నది సమాచారం. వీటికి అనుమతులు ఇచ్చేందుకు ఇరాన్ ససేమిరా అని తేల్చేయటంతో.. అనుమతుల కోసం వెయిట్ చేయక తప్పదు.ఈ దేశాలకు చెందిన నౌకలు యూఏఈ.. ఒమన్ తీరాల్లో లంగర్ వేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తాజాగా జరుగుతున్న యుద్ధం కారణంగా మొత్తం ఆరు క్రూయిజ్ నౌకలు ఈ జలసంధి వద్ద నిలిచిపోయాయి. సుమారు 15 వేల మంది ప్రయాణికులు ఇక్కడ చిక్కుకుపోయినట్లుగా సమాచారం. కంటైనర్ నౌకలు దాదాపు 130కు పైనే ఉన్నట్లు చెబుతున్నారు.

భారత్ కు చెందిన 22కు పైగా నౌకలు తీరం దాటేందుకు తగిన అనుమతుల కోసం వెయిట్ చేస్తుండగా.. చైనాకు చెందిన 40-50 నౌకలు కూడా అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవి కాక.. రష్యా, పాక్, ఇరాన్ కు చెందిన నౌకలు కొన్ని తగిన అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయి. సింఫుల్ లెక్కల్లో చెప్పాలంటే సాధారణంగా రోజువారీగా చూస్తే.. హర్మూజ్ జలసంధి నుంచి 138 నౌకలు దాటాల్సి ఉంది.

తాజాగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రోజుకు 4 నుంచి 6 నౌకలకు మాత్రమే అనుమతిని ఇస్తున్నాయి. దీంతో.. యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా.. ఇక్కడి రద్దీ మొత్తం క్లియర్ అయి.. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు నెలల సమయం పట్టే వీలుందని చెబుతున్నారు. యుద్ధం కొనసా...గితే పరిస్థితులు మరింతగా దిగజారతాయి. అదే సమయంలో యుద్ధం ముగిసినా.. పరిస్థితుల్లో మార్పులు వెను వెంటనే వచ్చే అవకాశం తక్కువ. ఏం జరిగినా.. ఈ యుద్ధం తాలుకూ ఎఫెక్ట్ మాత్రం కొన్ని నెలల పాటు కొనసాగటం ఖాయమని మాత్రం చెప్పక తప్పదు.