Begin typing your search above and press return to search.

పాక్ హనీట్రాప్ వలలో విశాఖ సీ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యోగి!

అవును... తాజాగా విశాఖ జిల్లాలో పాకిస్థాన్ హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో సీ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యోగికి

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:59 AM GMT
పాక్  హనీట్రాప్  వలలో విశాఖ సీ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యోగి!
X

గతకొంతకాలంగా హనీ ట్రాప్ విషయాలు నిత్యం దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మనదేశ అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్‌ పదే పదే హనీట్రాప్ వల విసురుతూనే ఉంది. ఇందులో భాగంగా... తాజాగా పాకిస్థాన్ మరోసారి ఆ పనికి పూనుకుంది. దీంతో... విశాఖ జిల్లాలో హనీ ట్రాప్‌ కలకలం రేపింది.

అవును... తాజాగా విశాఖ జిల్లాలో పాకిస్థాన్ హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో సీ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యోగికి పాకిస్తాన్‌ యువతి వల వేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో విశాఖ సి.ఐ.ఎస్.ఎఫ్. వింగ్ అప్రమత్తమైంది.

ఇందులో భాగంగా... కానిస్టేబుల్‌ ను సి.ఐ.ఎస్.ఎఫ్. వింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పాకిస్తాన్‌ యువతి విసిరిన వలపుల వలపై... విశాఖ సి.ఐ.ఎస్.ఎఫ్. వింగ్ గోప్యంగా విచారిస్తోందని సమాచారం.

వివరాళ్లోకి వెళ్తే... విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ గాపని చేస్తున్న సి.ఐ.ఎస్.ఎఫ్.కానిస్టేబుల్...గతంలో రక్షణ రంగంలో కీలకమైన బీడీఎల్‌,భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ లో విధులు నిర్వహించాడు.

ఈ క్రమంలోనే ఈ కానిస్టేబుల్ పై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల విసిరిందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా.. కీలక సమాచారం తెలుసుకునేందుకు ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీఏ అయిన యువతి ద్వారా వ్యవహారం నడిపించిందని అంటున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా సి.ఐ.ఎస్.ఎఫ్. కానిస్టేబుల్ తో ఆమె పరిచయం పెంచుకుందట. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా సదరు కానిస్టేబుల్ తో పరిచయం పెంచుకున్న ఆ యువతి యువతి... న్యూడ్‌ వీడియో కాల్స్‌ వరకు వెళ్లిందని అంటున్నారు. ఈ క్రమంలో సి.ఐ.ఎస్.ఎఫ్. కానిస్టేబుల్ ని ఒకసారి రూమ్‌ లో కూడా కలిసిందని చెబుతున్నారు. అనంతరం మెల్లగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టిందని సమాచారం.

ఈ నేపథ్యంలో అతడి కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారట. దీంతో మొత్తం విషయం బయటకు వచ్చిందని తెలుస్తుంది. మొత్తానికి కీలక సమాచారం పాక్ గూఢచార సంస్థకు చేరి ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. అతడిపై అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు.