Begin typing your search above and press return to search.

స్ట్రిప్డ్ వీడియో కాల్... 1.1 కోట్లు హాం ఫట్!

తనకు డబ్బులు చెల్లించకపోతే ఈ వీడియో కాల్ రికార్డింగ్ ను పేరెంట్స్ కి పంపిస్తానని ఆమె బెదిరింపుల కు దిగింది!

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:58 AM GMT
స్ట్రిప్డ్  వీడియో కాల్... 1.1 కోట్లు హాం ఫట్!
X

ఈమధ్య కాలం లో హనీ ట్రాప్ లు పెరిగిపోతున్నాయని, దానికి సంబంధించిన బాధితులు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారని, అంతకు ముందు లక్షల రూపాయలు నష్టపోతున్నారని ప్రతీ రోజూ ఏదో ఒక మూల నుంచి వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

అయినా కూడా అన్నీ తెలుసు అనుకునే వ్యక్తులు కూడా దెబ్బతినేస్తున్నారు. ఈ విషయంలో యువత, మధ్యవయస్కులు, వృద్ధులు అనే తారతమ్యాలేమీ లేవు. ఇక్కడ బలహీనత ఒకటే క్వాలిఫికేషన్. అది ఎంత పుష్కలంగా ఉంటే.. అంతగా చమురు వదిలిపోవడం ఖాయం. తాజాగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి అలానే వదిలిందని తెలుస్తోంది!

తాజాగా యూకే లోని సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ కు మ్యాట్రిమోనియల్ సైట్‌ లో ఒక మహిళతో పరిచయం అయ్యింది. అలా కొంతకాలం చాటింగ్ లు, ఫోన్ కాల్స్ అనంతరం వీడియో కాల్స్ వరకూ వెళ్లింది వ్యవహారం. సరిగ్గా ఇక్కడే ఉంది భారీ ట్విస్ట్!

ఆ వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయం లో ఆమె రికార్డింగ్ చేసింది. పైగా ఆమెది నకిలీ ప్రొఫైల్ అని అప్పటివరకూ ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి తెలియలేదు. తనకు డబ్బులు చెల్లించకపోతే ఈ వీడియో కాల్ రికార్డింగ్ ను పేరెంట్స్ కి పంపిస్తానని ఆమె బెదిరింపుల కు దిగింది!

దీంతో ఈ బెదిరింపుల కు తలొగ్గిన సదరు టెక్కి... ఆ మహిళ అకౌంట్ లోకి, ఫోన్ లోకి రూ.1.1 కోట్లకు పైగా నగదు బదిలీ చేశాడు. ఇలా ఎంత సమర్పించినా ఆమెకు తృప్తి ఉండకపోవడంతో టెక్కీకి కాస్త చికా కు అనంతరం ధైర్యం వచ్చినట్లుంది.

వెంటనే ఆమె అసలు పేరు తెలుసుకుని పోలీసుల కు ఫిర్యాదు చేసింది. వైట్‌ ఫీల్డ్ సి.ఇ.ఎన్. క్రైమ్ పోలీసులు రంగం లోకి దిగారు. ఆ మహిళ ఖాతాల్లో 84 లక్షల రూపాయల ను ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం నిందితుల ను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అయితే ఇప్పటికే ఎన్నోసార్లు... ఆన్‌ లైన్‌ లో అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలని, అనుచితమైన కాల్‌ ల నుండి డిస్కనెక్ట్ చేయమని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజల కు సలహా ఇస్తున్నారు పోలీసులు!