పెళ్లి రోజునుంచే హత్య ప్లాన్ చేసిన సోనమ్?
మేఘాలయ రాష్ట్రంలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయంలో వెలుగుచూస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Jun 2025 3:21 PM ISTమేఘాలయ రాష్ట్రంలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయంలో వెలుగుచూస్తున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో సోనమ్, రాజా రఘువంశీ జంట కనిపిస్తుంది. అయితే ఈ వీడియో బయటపడటం, ఆ తర్వాత సోనమ్ పోలీసులకు లొంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంటలో, భర్త రాజా రఘువంశీని సోనమ్ హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
పెళ్లి వీడియోలో రాజా ఎంతో ఆనందంగా సోనమ్ నుదుటిపై సింధూరం దిద్దుతూ కనిపిస్తాడు. పక్కన పూజారి వివాహ మంత్రాలు చదువుతుండగా, సోనమ్ మాత్రం ఏమాత్రం హర్షం లేకుండా పెళ్లి ఇష్టం లేని చూపులతో కనిపిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ముఖంపై ఎలాంటి భావోద్వేగం లేకపోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సోనమ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి ధైర్యం లేకపోయినా, హత్య చేయించడానికి గూండాలను పెట్టే ధైర్యం ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఇది పూర్తిగా నివారించదగిన ఘటన" అంటూ కొందరు కామెంట్ చేశారు.
మరికొందరు "ఆమె ముందు నుంచే ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అలాంటి పరిస్థితిలో కూడా బలవంతంగా ఈ పెళ్లి జరిపారంటే బాధ్యత కుటుంబం తీసుకోవాలి" అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. "పెళ్లి చేసుకునే ముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం తప్పనిసరి" అంటూ కొందరు సూచిస్తున్నారు.ఒక నెటిజన్ తీవ్రంగా స్పందిస్తూ "ఆ అమాయకుడు తన హనీమూన్ ట్రిప్ లో ప్రాణాలు కోల్పోతానని కలలోనూ ఊహించలేదు" అని అన్నారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. సోనమ్ లొంగిపోయిన తరువాత, హనీమూన్ సమయంలో జరిగిన ఘటనలన్నింటినీ పోలీసులు త్వరితగతిన పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడయ్యే వరకు ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.