Begin typing your search above and press return to search.

ఇరాన్ లో హిజాబ్ నిబంధన... పోలీసులు దాడితో కోమాలో అమ్మాయి!

రెండ్రోజుల క్రితం టెహ్రాన్ లో స్పృహతప్పి పడిపోయిందని చెబుతున్న 16 ఏళ్ల ఇరాన్ పాఠశాల విద్యార్థిని ఆసుపత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   5 Oct 2023 3:40 PM GMT
ఇరాన్ లో హిజాబ్ నిబంధన... పోలీసులు దాడితో కోమాలో అమ్మాయి!
X

రెండ్రోజుల క్రితం టెహ్రాన్ లో స్పృహతప్పి పడిపోయిందని చెబుతున్న 16 ఏళ్ల ఇరాన్ పాఠశాల విద్యార్థిని ఆసుపత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయిందని తెలుస్తుంది. ఇస్లామిక్ హెడ్‌ స్కార్ఫ్ (హిజాబ్) ధరించడానికి నిరాకరించినందుకు అర్మితా గరావాండ్‌ పై మహిళా పోలీసు అధికారులు దాడి చేశారని కుర్దిష్ - కేంద్రీకృత హక్కుల సంఘం హెంగావ్ తెలిపింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అత్యంత దయణీయంగా ఉందని అంటున్నారు!

అవును... ఇరాన్ మెట్రోలో హిజాబ్ నిబంధనను ఉల్లంఘించినందుకు ఓ బాలికపై పోలీసులు దారుణంగా దాడి చేయగా, ఆమె కోమాలోకి వెళ్లిందని తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. ఈ సమయంలో భారీ భద్రతలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో బాలికకు కట్టుదిట్టమైన భద్రతతో చికిత్స అందిస్తుండటం తోపాటు.. ఆమెను చూడటానికి ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తుంది. ఆమె మెడ, తలపై కట్టు కట్టి ఉందని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. అదంత కట్టుకద అని చెప్పుకుంటుంది.

ఈ సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఈ ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేసింది. తక్కువ రక్తపోటు (లో బీపీ) కారణంగా ఆమె స్పృహతప్పి పడిపోయిందని పేర్కొంది. టెహ్రాన్ అండర్‌ గ్రౌండ్ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ డోరోస్తీ ఈ విషయంపై స్పందించారు. ప్రయాణికులు లేదా మెట్రో ఎగ్జిక్యూటివ్‌ ల మధ్య జరిగిందని చెబుతున్న భౌతిక ఘర్షణలు అవాస్తవమని అంటున్నారు.

కాగా... ఆదివారం టెహ్రాన్‌ లోని షోహదా అండర్‌ గ్రౌండ్ స్టేషన్‌ లో గరావాండ్‌ పై దాడి జరిగిందని, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని హెంగావ్ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు టెహ్రాన్‌ లోని ఫజ్ర్ ఆసుపత్రిలో గట్టి భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఆమెను సందర్శించడానికి కుటుంబ సభ్యులకు కూడా అనుమతి లేదని వెల్లడించింది.

దీంతో... ఇరాన్ కూడా ఆఫ్ఘనిస్థాన్ బాటలోనే నడుస్తోందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... మహిళలు హిజాబ్ ధరించాల్సిందే అని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌ లో తప్పనిసరి డ్రెస్ కోడ్‌ లో భాగంగా హిజాబ్ అమలు చేయబడినప్పటికీ... చాలా మంది మహిళలు ఈ నిబంధనలను పాటించడం లేదు.