2024లో అత్యధిక వేతనాలు పొందిన అమెరికా CEOలు వీరే
2024 సంవత్సరానికి గాను అమెరికాలో అత్యధికంగా వేతనం పొందిన సీఈవోగా కోహెరెంట్ కార్పొరేషన్ సంస్థకు చెందిన సీఈవో జిమ్ అండర్సన్ నిలిచారు.
By: Tupaki Desk | 15 July 2025 10:49 AM IST2024 సంవత్సరానికి గాను అమెరికాలో అత్యధికంగా వేతనం పొందిన సీఈవోగా కోహెరెంట్ కార్పొరేషన్ సంస్థకు చెందిన సీఈవో జిమ్ అండర్సన్ నిలిచారు. టెక్ దిగ్గజాలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కంపెనీల CEOలను అధిగమించి, సాపేక్షంగా తక్కువగా తెలిసిన ఒక టెక్నాలజీ సంస్థకు చెందిన CEO అగ్రస్థానంలో నిలవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. విశేషం ఏంటంటే ఈ టాప్ 20లో ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సాలరీ కేవలం 10.73 మిలియన్స్ మాత్రమే కావడం గమనార్హం.
పెన్సిల్వేనియాలోని సాక్సన్‌బర్గ్ పట్టణంలో ప్రధాన కార్యాలయం కలిగిన కోహెరెంట్ కార్పొరేషన్ నెట్‌వర్క్ , లేజర్ సిస్టమ్ పరికరాల తయారీలో నిపుణత కలిగి ఉంది. జిమ్ అండర్సన్ మొత్తం $101 మిలియన్ల వేతనంతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అత్యధిక వేతనాలు పొందిన CEOలు – టాప్ 20 జాబితా (2024)
1. జిమ్ అండర్సన్ (Coherent Corp): $101 మిలియన్లు
2. బ్రియన్ చార్ల్ రాబిన్స్ (Paramount Global): $95.8 మిలియన్లు
3. లారెన్స్ కెల్ప్ (Occidental Petroleum): $87.3 మిలియన్లు
4. సత్య నడెళ్ల (Microsoft): $79.1 మిలియన్లు
5. టిమ్ కుక్ (Apple): $74.6 మిలియన్లు
6. సావియో సిప్రియన్ (Advanced Micro Devices): $65.5 మిలియన్లు
7. నికేష్ అరోరా (Palo Alto Networks): $58 మిలియన్లు
8. శాంతను నారాయణన్ (Adobe): $52.3 మిలియన్లు
9. సురేష్ రామస్వామి (Intel): $51.1 మిలియన్లు
10. మోంట్ె జెడ్. (Netflix): $46.9 మిలియన్లు
11. మ్యాథ్యూ మర్పీ (Marvell Technology): $45.1 మిలియన్లు
12. నోర్బర్ట్ రౌడీ (Danaher): $40.6 మిలియన్లు
13. మార్క్ బెనీఫ్ (Salesforce): $39.6 మిలియన్లు
14. దారా ఖోస్రోవ్షాహి (Uber): $39.4 మిలియన్లు
15. బ్రయన్ హన్సన్ (Solventum): $39.3 మిలియన్లు
16. చార్లెస్ రాబిన్స్ (Cisco): $38.2 మిలియన్లు
17. స్టీఫెన్ ష్వార్జ్‌మాన్ (Blackstone Group): $37.1 మిలియన్లు
18. సాసన్ గూడర్‌జీ (Intuit): $36.5 మిలియన్లు
19. విలియం లాన్సింగ్ (FICO): $35.3 మిలియన్లు
20. సంజయ్ సింగ్ (Chewy Inc): $35.1 మిలియన్లు
