Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రికి హైకోర్టు నోటీసులు.. ఎందుకు? ఎక్క‌డ‌?

సిద్ధరామయ్య ఎన్నికల సమయం లో అవినీతి విధానాల కు పాల్పడ్డారని ఆయ‌న పిటిష‌న్‌ లో పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   28 July 2023 3:07 PM GMT
ముఖ్య‌మంత్రికి హైకోర్టు నోటీసులు.. ఎందుకు?  ఎక్క‌డ‌?
X

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపించింది. సెప్టెంబ‌రు 1లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ ని కూడా ఆదేశించింది. ఇటీవ‌ల కాలం లో క‌ర్ణాట‌క స‌ర్కరును కూల్చేందుకు.. కొన్ని కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని.. పొరుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ప్ర‌యోగాలు కూడా సాగుతున్నాయ‌ని క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

ఇది నిజ‌మో.. కాదో అనే చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యం లోనే అనూహ్యంగా సిద్ద‌రామ‌య్య పై రాష్ట్ర హైకోర్టులో కేసు న‌మోదు కావ‌డం.. ఆయ‌న‌ ను స‌మాధానం చెప్పాలంటూ.. హైకోర్టు ఆదేశించ‌డం.. ఇప్పుడు మ‌రింత చ‌ర్చ‌కు దారితీశాయి.

ఈ ఏడాది మే లో జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం ద‌క్కిం చుకున్న సిద్ద‌రామ‌య్య‌.. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే..ఈ య‌న‌ పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ ని కోరు తూ.. రాష్ట్ర హైకోర్టు లో పిటిష‌న్ దాఖ‌లైంది. అదే నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్య‌క‌ర్త అని చెప్పుకొనే కేఎం శంకర అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.

సిద్ధరామయ్య ఎన్నికల సమయం లో అవినీతి విధానాల కు పాల్పడ్డారని ఆయ‌న పిటిష‌న్‌ లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన జస్టిస్ సునీల్ దత్ యాదవ్ సెప్టెంబర్ 1లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ..నోటీసులు జారీ చేశారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లో అధికారమే ధ్యేయంగా అన్ని పార్టీలూ హామీలు గుప్పించాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ కూడా ఐదు కీల‌క ప‌థ‌కాల‌ ను ప్ర‌క‌టించింది. అయితే..దీని ని శంక‌ర‌.. అవినీతివిధానం(కరప్ట్ ప్రాక్టీస్) కిందకు వస్తుందని, ఇది లంచమివ్వడం తో సమానమని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(2)ను ఉల్లంఘించడమవుతుందని వాదించారు.

సిద్ధరామయ్య ఎన్నికల సమయం లో అవినీతి విధానాలకు పాల్పడి గెలిచార‌ని ఆరోపించారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వ్యాలీడ్ అవుతుందో తెలియ‌దుకానీ.. ఇప్ప‌టికైతే.. సీఎం గా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడు శుక్ర‌వారాలుకూడా కాక‌ముందే.. సిద్దూకు హైకోర్టు నుంచి నోటీసులు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.