Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... చంద్రబాబుకు వరుసగా మూడు షాకులు!

ఈ రోజు ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది! ఇందులో భాగంగా వరుసగా మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

By:  Tupaki Desk   |   9 Oct 2023 7:21 AM GMT
బిగ్  బ్రేకింగ్... చంద్రబాబుకు వరుసగా మూడు షాకులు!
X

పరిస్థితులు మరీ పగబట్టేశాయో.. లేక, ఆ కేసుల్లో వైసీపీ నేతలు చెబుతున్న కచ్చితంగా మేటర్ ఉందో ఏమో కానీ... చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది! ఈ రోజు ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది! ఇందులో భాగంగా వరుసగా మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

అవును... ఈ సోమవారం చంద్రబాబుకు కేసుల విషయంలో అత్యంత కీలకం అని గత రెండు రోజులుగా రాజకీయవర్గాల్లో కీలక చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్ కేసు, అంగుళ్ల అల్లర్ల కేసు, ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

ఇదే సమయంలో... ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో సుమారు నెల రోజులుగా ఉండటానికి కారణమైన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో కూడా ఈ రోజు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.

ఇటీవల స్కిల్ స్కాం కేసులో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై ఇటీవల విచారణ చేపట్టిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్న సంగతి తెలిసిందే. అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో... మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్‌, మరోపక్క సీఐడీ కస్టడీ పిటిషన్ లపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుందని తెలుస్తుంది.

మరోపక్క ఇవాళ సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ విచారణకు రానుందని అంటున్నారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ద బోస్‌, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, అక్టోబర్ 3న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్ట్ ముందు దాఖలు చేసిన పత్రాలను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా... ఫైబర్‌ నెట్‌ కేసులో ఏ-24 గా ఉన్న చంద్రబాబు.. అమరావతి ఇన్నర్‌ రింగు రోడ్డు అలైనమెంట్ స్కాం కేసులో ఏ-1గా ఉన్నారు. అదేవిధంగా... అంగళ్లు అల్లర్ల కేసులో కూడా చంద్రబాబు ఏ-1గానే ఉన్నారు. ఈ మూడు కేసులకు సంబంధించి బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను నేడు హైకోర్టు కొట్టివేసింది. అయితే... హైకోర్టు తీర్పుపై చంద్రబాబుకు సుప్రీంకి వెళ్లేందుకు అవకాశం ఉంది.