Begin typing your search above and press return to search.

ప్రతీ ఐదుగురిలో ఒక బాస్ సైకోపాత్... ఎలా గుర్తించాలంటే..?

చాలా మంది ఉద్యోగులకు వారి పని ఒత్తిడి కంటే పెద్ద సమస్య తమ తమ బాస్ అని చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   7 Jun 2025 8:30 PM
ప్రతీ ఐదుగురిలో ఒక బాస్ సైకోపాత్... ఎలా గుర్తించాలంటే..?
X

చాలా మంది ఉద్యోగులకు వారి పని ఒత్తిడి కంటే పెద్ద సమస్య తమ తమ బాస్ అని చెబుతుంటారు. బాస్ క్యాబిన్ నుంచి కాల్ వస్తే.. పులి బోన్ లోకి వెళ్తున్నట్లు కొంతమంది ఫీలయితే, పిచ్చోడి గదిలోకి వెళ్తున్నట్లు మరికొందరు భావిస్తుంటారని చెబుతారు. దానికి కారణం.. తమ కింది ఉద్యోగులపై సదరు బాస్ ల ప్రవర్తనా శైలే! అలాంటి బాస్ ప్రతీ ఐదుగురిలో ఒకరున్నారని అధ్యయనం వెల్లడించింది!

అవును... ఫోరెన్సిక్ మనస్తత్వవేత్త నాథన్ బ్రూక్స్, బాండ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బాటారినా ఫ్రిట్జోన్, శాన్ డియాగో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సైమన్ క్రూమ్ లు 261 మంది కార్పొరేట్ నిపుణులను అధ్యయనం చేయగా.. వారిలో 21% మంది గణనీయమైన స్థాయిలో మానసిక లక్షణాలను కలిగి ఉన్నారని తేలింది! ఈ సందర్భంగా వారి లక్షణాలు వెల్లడయ్యాయి!

ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి "విజయవంతమైన మానసిక రోగి" అని పిలవబడే వారిపై పరిశోధనలు పెరిగాయని అంటున్నారు. ఈ రకమైన బాస్ లలో... చిత్తశుద్ధి లేకపోవడం.. సానుభూతి లేకపోవడంతో పాటు.. అహంకారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే వీరిని "విజయవంతమైన మానసిక రోగి"గా అభివర్ణిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలాంటి లక్షణాలను నార్సిసిజం అని అంటారని చెప్పిన నిపుణులు... ఇది గర్వం, స్వీయ ప్రశంస, ప్రతిభల భ్రమల రూపంలో వ్యక్తమవుతుందని చెబుతున్నారు! వీరు సాధారణంగా తమ తోటివారికంటే తాము చాలా ప్రత్యేక హక్కులకు అర్హులుగా భావిస్తారని.. అలానే ప్రవర్తిస్తారని చెబుతున్నారు. వీరిలో కొంతమంది ఇతరుల ప్రశంసల కొసం తరచూ ప్రయత్గిస్తుంటారని అంటున్నారు.

ఇదే సమయంలో... వీరు సాధారణంగా ఇతరులపై తక్కువ ఆసక్తి కలిగి ఉంటారని.. సానుభూతి లోపాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు. ఈ కారణంగా వారు తమను తాము తప్ప ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధను ప్రదర్శించడం చాలా అరుదుగా కనిపిస్తుందని వెళ్లడించారు!