Begin typing your search above and press return to search.

సైన్యం నియమించుకునే ఎలుకలు.. 'హీరో రాట్స్' గురించి తెలుసా?

భద్రతా దళాలలో డాగ్స్ ఒక భాగమనే సంగతి తెలిసిందే! బాంబులను గుర్తించడంలోనూ, నేరస్తులను పట్టుకోవడంలోనూ ఇవి అధికారులకు ఎంతగానో సహాయపడుతుంటాయి.

By:  Tupaki Desk   |   1 Jun 2025 3:00 AM IST
సైన్యం నియమించుకునే ఎలుకలు.. హీరో రాట్స్ గురించి తెలుసా?
X

భద్రతా దళాలలో డాగ్స్ ఒక భాగమనే సంగతి తెలిసిందే! బాంబులను గుర్తించడంలోనూ, నేరస్తులను పట్టుకోవడంలోనూ ఇవి అధికారులకు ఎంతగానో సహాయపడుతుంటాయి. అయితే చాలా దేశాల్లో సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వబడిన ఎలుకలు సహాయపడతాయనే సంగతి తెలుసా? భారత సైన్యం కూడా బోర్డర్ లో వ్యూహాత్మకంగా తేనెటీగలను పెంచుతుందని తెలుసా?

అవును... కంబోడియాలోని ఓ ప్రాంతంలో ఎలుకలు పొలాల గుండా తిరుగుతున్నాయి. అయితే.. అవి తిరుగుతున్నది ఆహారం కోసం కాదు.. ప్రమాదాన్ని గుర్తించడానికి. ఎందుకంటే ఇవి సాధారణ ఎలుకలు కావు.. ఆఫ్రికన్ జెయింట్ ఫౌచ్డ్ ర్యాట్స్. వీటినే ప్రేమగా "హీరో రాట్స్" అని పిలుస్తారు. ఇవి భూమిలోపల ఉన్న ల్యాండ్ మైన్లు, పేలుడు పదార్ధాలను గుర్తిస్తాయి.

ఇలా వాటిని అద్భుతమైన ఖచ్చితత్వంతో గుర్తించడానికి శిక్షణ పొంది ఉంటాయి. దీంతో.. వీటి సేవలను కంబోడియా సైన్యం స్వీకరించింది. ఇదే సమయంలో ప్రస్తుతం రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్ తో పాటు హమాస్ ను వణికిస్తోన్న ఇజ్రాయెల్, పలు యూరోపియన్ దేశాల సైన్యాలు వీటిని స్వీకరించాయి. వీటి సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

సుమారు 45 సెంటీమీటర్ల పొడవు, సుమారు అర మీటరు పొడవున్న తోకలను కలిగి ఉన్న ఈ ఎలుకల బరువు దాదాపు 1.2 కిలోల వరకూ ఉంటుంది. సబ్-సహారా ఆఫ్రికాకు చెందిన ఈ భారీ ఎలుకలు ట్రినిట్రోటోలుయెన్ (టీ.ఎన్.టీ) వంటి పేలుడు పదార్ధాల సూక్ష్మ జాడలను కూడా గుర్తించగలిగే ప్రత్యేకమైన శక్తివంతమైన వాసన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతారు.

ఇళ్ల వద్ద కనిపించే చిన్న పిల్లిని పోలి ఉండే ఈ ఎలుకలు.. జంతువుల మాదిరి కాకుండా, ల్యాండ్ మైన్లపై అవి పేలకుండా తేలికగా నడుస్తాయి. వీటి పెర్ఫార్మెన్స్ కూడా చాలా వేగంగా ఉంటుందని చెబుతారు. ఉదాహరణకు ఒక టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఉన్న ప్రాంతాన్ని క్లియర్ చేయాలంటే మనిషికి రోజు పడితే.. ఈ ఎలుకలు కేవలం 30 నిమిషాల్లోనే క్లియర్ చేయగలవట.

సుమారు 6 నుంచి 8 సంవత్సరాల జీవితకాలంలో.. ఒక ఏదాది కంటే తక్కువ సమయం శిక్షణ పొందే ఈ ఎలుకలు.. తమ జీవితంలో ఎక్కువ భాగం సేవ చేయగలవని చెబుతున్నారు. పైగా.. ఇవి చాలా నమందగినవి నిరూపించబడినాయని చెబుతున్నారు. బెల్జియన్ లాభాపేక్షలేని ‘ఏపీఓపీఓ’ సంస్థ ఈ ఎలుకలకు "హీరో రాట్స్" అని బ్రాండ్ చేసి శిక్షణ ఇవ్వడంలో ముందుంది.

ఇలా ప్రపంచంలోని పలు దేశాల్లో మందుపాతరలను ఎలుకలు వెతుకుతుండగా.. భారత్ - బంగ్లా సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీ.ఎస్.ఎఫ్.) తేనెటీగలను మొహరించింది. ఇందులో భాగంగా... పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాలో బీ.ఎస్.ఎఫ్. 32వ బెటాలియన్ సరిహద్దుల్లోని ముళ్ల కంచెల వెంట తేనెటీగల పెంపకం పెట్టెలను వేలాడదీయడం ప్రారంభించింది.

అలా అని ఇవి తేనెకోసం మాత్రమే అనుకుంటే పొరపాటే... ఇవి సరిహద్దు వెంబడి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే స్మగ్లర్లు, చొరబాటుదారులను నిరోదించడంలో సహకరిస్తాయి. కంచెలను దాటేందుకు ప్రయత్నించేవారిపై ఆ కదలికలతో దాడులు చేస్తాయి! ఇది ఒకప్పుడు చాలా అసంబద్ధం అనిపించొచ్చు కానీ.. ఇప్పుడు చాలా ప్రభావవంతంగా నిరూపించబడుతోందని అంటున్నారు.